క్రీడాభూమి

ఏసీఏ అధ్యక్షుడిగా వాట్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 12: మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. 58 ఏళ్ల వాట్సన్ తన కెరీర్‌లో 59 టెస్టులు, 190 వనే్డలు, 58 టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున నిలకడగా రాణించిన వాట్సన్ తన ఎంపిక పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి ఇచ్చే అవకాశం తనకు లభించిందని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించాడు. ఏసీఏకు అత్యుత్తమ సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపాడు.
ర్యాలీ ఆస్ట్రేలియా రద్దు
కాఫ్స్ హార్బర్ (ఆస్ట్రేలియా): ఈవారం జరగాల్సిన ర్యాలీ ఆస్ట్రేలియాను రద్దు చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఎఫ్‌ఐఏ వరల్డ్ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో చివరి రౌండ్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే, న్యూ సౌత్‌వేల్స్‌లోని కాఫ్స్ హార్బర్‌లో కార్చిచ్చు చెలరేగి, భారీ విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో, నిర్వాహకులు ఫైనల్ రనౌండ్‌ను రద్దు చేశారు. కార్చిచ్చు వ్యాపించడంతో కనీసం ముగ్గురు పౌరులు మృతి చెందగా, వేలాదిగా చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీనిని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తునే ఉన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, ఇంకా పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీనితో వరల్డ్ ర్యాలీ చివరి రౌండ్‌ను రద్దు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.