క్రీడాభూమి

మలాన్ వీరోచిత సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, నవంబర్ 8: న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు చెలరేగడంతో కివీస్ 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అంతకుముందు టా స్ గెలిచిన న్యూజిలాండ్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వా నించింది. దీంతో ఇన్నింగ్స్‌ను టామ్ బంటాన్, జానీ బెయర్ స్టో ఆరంభించారు. అయతే శాంత్నార్ వేసిన నాలుగో ఓవర్‌లో బెయర్ స్టో (8) క్యాచ్ అవుటై మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దావిద్ మలాన్ వచ్చీ రావడంతో నే కివీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు బంటాన్ సైతం ఎదురుదాడికి దిగడంతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో బంటాన్ (31) శాంత్నార్ బౌలింగ్‌లోనే ఎల్బీగా అవుట్ అయ్యాడు. దీంతో 58 పరుగులకే ఇంగ్లీష్ జట్టు ఓపెనర్లద్దిరినీ కోల్పోయంది.
వీరవిహారం..
నాలుగో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయా న్ మోర్గాన్, మలాన్‌తో కలిసి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్క లు చూపించారు. బౌలరెవరనేది చూడకుండా బౌండరీలను బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమం లో మలన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ మో ర్గాన్ 21 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించాడు. మరోవైపు వీరిద్దరినీ విడదీసేందుకు న్యూజిలాండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇదిలాఉంటే అర్ధసెంచరీ 31 బంతులను తీసుకున్నా మలాన్, మరో 17 బంతుల్లోనే సెంచరీ సాధించ డం విశేషం. చివరి ఓవర్ వేసిన కివీ కెప్టెన్ సౌథీ 4 బంతికి మోర్గాన్ (91) అవుట్ చేశాడు. అప్పటికీ వీరిద్దరూ జట్టుకు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఇందులో 29 బౌండరీలు, 13 సిక్సర్లు ఉండడం విశేషం.
మోర్గాన్ ఒక్కడే..
ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన కెప్టెన్ మోర్గాన్ ఇంగ్లాండ్ తరఫున అతి తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా సరికొత్త ఘనతను అందుకున్నాడు. మరోవైపు దావీద్ మలాన్ (103, నాటౌట్) కూడా 48 బంతు ల్లోనే సెంచరీ సాధించి, ఇంగ్లాండ్ తరఫున అతి తక్కువ బం తుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. జట్టు స్కోరు పరంగా కూడా ఇంగ్లాండ్‌కు టీ20ల్లో ఇదే అత్యధికం.
ధాటిగా ఆరంభించి..
భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు ప్రారంభం నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (27), కొలిన్ మున్రో (30) 5 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 దాటించారు. వీరి దూకుడును చేసి న్యూజిలాండే గెలుస్తుంది అనుకున్నారం తా. అయతే టామ్ కుర్రాన్, మాథ్యూ పార్కిన్సన్ ఓపెనర్లిద్దనీ పెవిలియన్‌కు పంపారు. అక్కడి నుంచి కివీస్ పతనం ప్రారం భమైంది. ఆ తర్వాత వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ (3), కొలిన్ డీగ్రాండ్ హోం (7), రాస్ టేలర్ (14), డారియల్ మిచెల్ (2), మిచెల్ శాంత్నార్ (10) దారుణంగా విఫలమవ్వగా, కెప్టెన్ టి మ్ సౌథీ (39) చివర్లో కొద్దిసేపు పోరాడినా ఫలితం లేకపోయం ది. చివరి వికెట్‌గా ఇష్ సోదీ (9) అవుటవడంతో కివీస్ 16.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ట్రెంట్ బౌల్ట్ (5) నాటౌ ట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మాథ్యూ పార్కిన్సన్ 4 వికెట్లు పడగొట్టగా, క్రిస్ జోర్డాన్ 2, సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్‌లు చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు 2-2తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ ఈ నెల 10న జరగనుంది.