క్రీడాభూమి

చరిత్ర సృష్టించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : కోహ్లీసేన సఫారీలతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇరు జట్లు 1-1తో సమం చేశాయి. దీంతో నేటి నుంచి జరిగే టెస్టు సిరీస్‌లో సత్తా చాటేందుకు ఇటు టీమిండియా , అటు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విశాఖ వేదికగా జరిగే మొదటి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు మొండిచేయ ఎదురైంది. గత మ్యాచుల్లో పేలవ ప్రదర్శన కారణంగానే టీమ్ మేనేజ్‌మెంట్ పంత్‌కు తుది జట్టులో చోటు కల్పించలేదు. అతడి స్థానంలో సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహాను జట్టులోకి తీసుకుంది. దీంతో గాయం నుంచి కోలుకున్న చాలారోజుల తర్వాత సాహా అంతర్జాతీయ మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో రెగ్యూలర్ ఓపెనర్ రోహిత్ శర్మ తొలిసారిగా టెస్టుల్లో ఓపెనింగ్ చేయనున్నాడు. ఇటీవల జరిగిన త్రీడే మ్యాచ్‌లో కెప్టెన్‌గా రోహిత్ పరుగులే మీ చేయకుండానే పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. రోహిత్, సాహాతో పాటు తుది జట్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ కూడా చోటు దక్కించుకున్నారు.
ఇద్దరు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లు..
టీమిండియా మొదటి టెస్టుకు ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. బౌలింగ్ విభాగంలో ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న రవీంద్ర జడేజాతో పాటు చాలారోజుల తర్వాత మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేశారు. వీరిద్దరితో పాటు ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి పార్ట్ టైం బౌలర్‌గా సేవలందించనున్నాడు. ఇక పేసర్ల విషయానికొస్తే భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్ లేకుండానే కేవలం ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీతో బరిలోకి దిగనుంది.
ఓపెనర్లుగా మయాంక్, రోహిత్
శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ తుది జట్టులో లేకపోవడంతో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. మూడో బ్యాట్స్‌మన్‌గా చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానే, హనుమ విహారితో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. అయతే మిడిలార్డర్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఆల్ రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, ర వీంద్ర జడేజాలు కూడా రాణిస్తే కోహ్లీ సేనను ఆపడం సఫారీలకు కష్టమే. వనే్డ, టీ20ల్లో తిరుగులేని ఓపెనర్‌గా పేరున్న రోహిత్ 2013లో టెస్టు ఆరంగేట్రం చేసినా ఇప్పటివరకు ఆడింది కేవలం 27 టెస్టులు మాత్రమే. చివరిసారిగా గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆడాడు.
యువకులతో బరిలోకి..
మరోవైపు సీనియర్ ఆటగాళ్లు ఏబీ డివిలీయర్స్, హషీమ్ అమ్లాలు లేకపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు యువకులతో బరిలోకి దిగనుంది. ప్రస్తుత జట్టులో చాలామంది ఆటగాళ్లకు టెస్టులు ఆడిన అనుభవం తక్కువే. దీంతో జట్టు భారమంతా సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్, క్వింటన్ డీకాక్, లుంగి ఎంగిడి, కగిసో రబదపై పడనుంది.
ఓటమి లేకుండా..
ఇటీవల వరుస విజయాలతో జోరుమీదున్న కోహ్లీ సేనను అడ్డుకోవడం దక్షిణాఫ్రికాకు కష్టమే. అందులోనూ స్వదేశంలో జరుగుతున్న మ్యాచుల్లో టీమిండియా మరింత ప్రమాదకరంగా బరిలోకి దిగుతుంది. కాగా స్వదేశంలో గత 10 టెస్టు సిరీస్‌ల్లో భారత జట్టు ఓడిపోలేదు. దీంతో గతంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఈ రికార్డును భారత్ సమం చేసింది. ప్రస్తుతం సఫారీలతో విరాట్ సేన ఈ సిరీస్ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించనుంది. భారత జట్టు 2013 నుంచి స్వదేశంలో జరిగిన ఏ టెస్టు సిరీస్‌ను కోల్పోలేదు.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ.
దక్షిణాఫ్రికా: ఫఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), టెంబ బవుమా, థినస్ డీబ్రైన్, క్వింటన్ డీకాక్, డీన్ ఎల్గర్, జుబేయర్ హమ్జా, కేశవ్ మహారాజ్, అయడేన్ మార్కరమ్, సినారన్ ముత్తుస్వామి, లుంగి ఎంగిడి, అన్రిచ్ నార్జ్, వెర్నర్ ఫీలండర్, డానే పీడ్ట్, కగిసో రబద, రుడీ సెకండ్.
*చిత్రాలు..నెట్ ప్రాక్టీస్‌లో మయాంక్ అగర్వాల్
*చతేశ్వర్ పుజారాతో కోచ్ రవిశాస్ర్తీ