క్రీడాభూమి

సీఏసీ, ఐసీఏ పదవులకు శాంత రంగస్వామి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యురాలిగా, ఇండియన్ క్రికెటర్ల సంఘం (ఐసీఏ) డైరెక్టర్‌గా తన పదవులకు మాజీ క్రికెటర్ శాంత రంగస్వామి రాజీనామా చేసింది. పరస్పర ప్రయోజనాలను కలిగి ఉండేలా ఒకటికి మించిన పదవుల్లో కొనసాగడంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే శాంత రంగస్వామికి పరస్పర ప్రయోజనాలు (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్) కలగచేసే పదవుల్లో కొనసాగుతున్నారని పేర్కొంటూ, వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐ నోటీసు జారీ చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆమె తన జోడు పదవులకు రాజీనామా చేసింది. తాను నిర్వహిస్తున్న పదవుల్లో పరస్పర ప్రయోజనాలు అనేది ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని ఆమె పీటీఐతో మాట్లాడుతూ వ్యాఖ్యానించింది. సీఏసీ సంవత్సరానికి ఒకసారి లేదా రెండేళ్లకోసారి సమావేశం అవుతున్నదని ఆమె తెలిపింది. ఈ పరిస్థితుల్లో పరస్పర ప్రయోజనాలను తాను కలిగి ఉన్నానని అనడంలో అర్థం లేదని పేర్కొంది. సీఏసీ కమిటీలో సభ్యురాలిగా ఉండడం తనకు గౌరవంగా భావించానని శాంత అన్నది. కపిల్ దేవ్, అంశుమాన్ గైక్వాడ్‌తో కలిసి ఐసీఏ డైరెక్టర్ పదవిని తాను చిత్తశుద్ధితో నిర్వర్తించానని తెలిపింది. ఐసీఏ ఎన్నికల కంటే ముందుగానే రాజీనామా చేశానని, కాబట్టి తనపై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఆమె వ్యాఖ్యానించింది. తన రాజీనామా లేఖను బీసీసీఐ పాలనాధికారుల బృందం (సీఓఏ) సభ్యులకు, బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రికి పంపానని ఆమె చెప్పారు. ఇలావుంటే, బీసీసీఐ ఎథిక్స్ కమిటీ శనివారం శాంతకు నోటీసు జారీ చేసింది. పరస్పర ప్రయోజనాలతో కూడిన రెండు పదవులను నిర్వహించడంపై వివరణ కోరింది. వచ్చేనెల 10వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. దీనిపై శాంత స్పందిస్తూ, తనకు పరస్పర ప్రయోజనాలు పొందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని తెలిపింది. రాజీనామా చేయడం ద్వారా అనుమానాలకు తెరదించానని వ్యాఖ్యానించింది.

*చిత్రం...శాంత రంగస్వామి