క్రీడాభూమి

రోహిత్ డకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 28: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్ శనివారం డ్రాగా ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 199 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన సఫారీ బ్యాట్స్‌మెన్లలో టెంబ బవుమా (87, నాటౌట్), వెర్నర్ ఫిలాండర్ (48) పరుగులతో రాణించారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 64 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 279 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత బౌలర్లలో ధర్మేంద్ర సిన్హా జడేజా 3 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, ఇషాన్ పోరెల్ చెరో వికెట్‌ను తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ 2 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత కొద్దిసేపటికే అభిమాన్యూ ఈశ్వరన్ (13) రబద బౌలింగ్‌లో మార్కరమ్ చేతికి చిక్కాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ప్రియాంక్ పంచల్‌తో కలిసి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (39) జట్టు స్కోరును పెంచే క్రమంలో మహరాజ్ బౌలింగ్‌లో ఫిలాండర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 85 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడ్డ బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టును ప్రియాంక్ పంచల్, కరుణ్ నాయర్ గట్టెక్కించే ప్రయత్నం చేశా రు. ఈ క్రమంలోనే పంచల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయతే కొద్దిసేపటికే 2 పరుగుల వ్యవధిలో బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు కరుణ్ నాయర్ (19), పంచల్ (60) వికెట్లను కోల్పోయంది.
సెంచరీ భాగస్వామ్యం..
ఈ దశలో క్రీజులో ఉన్న సిద్దేశ్ లాద్, వికెట కీపర్ శ్రీకర్ భరత్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఓవైపు ధాటి గా ఆడుతూనే, మరోవైపు వికెట్లను కాపాడుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీకర్ భరత్ (71), సిద్దేశ్ లాద్ (60) అర్ధ సెంచరీల ను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మహరాజ్ బౌలింగ్‌లో శీకర్ భరత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జలజ్ సక్సేనా (2), ధర్మేంద్రసిన్హా జడే జా (0) వెంటవెంటనే అవుటయ్యారు. అప్పటికే సమయం కావడంతో భారత్ 64 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయ 265 పరుగులు చేసింది. సమయం దగ్గర పడడంతో అంపైర్లు మ్యా చ్‌ను నిలిపివేసి, మ్యాచ్‌ను డ్రా గా ప్రకటించారు. సఫారీ బౌల ర్లలో కేశవ్ మహరాజ్ 3 వికెట్లను పడగొట్టగా, వెర్నర్ ఫిలాం డర్ 2, కగిసో రబద 1 వికెట్ తీసుకున్నారు.
రోహితే రాణించేనా?
చాలారోజుల తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో రాణిస్తాడో లేదోనని అభిమానుల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. టెస్టుకు ముందే బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి త్రీడే మ్యాచ్ ఆడిన రోహిత్ పరుగులేమీ చేయకుండానే అవుట్ కావడంతో అసలు మ్యాచ్‌కు ముందునుంచే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల పేలవ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్‌ను పక్కనబెట్టిన సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు రోహిత్‌కు అవకాశం కల్పించింది. అయతే గత టెస్టు మ్యాచుల్లో మిడిలార్డర్‌లో బరిలోకి దిగిన రోహిత్, రాబోయే టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీంతో సన్నాహాక మ్యాచ్‌లోనే డకౌట్ అయన రోహిత్ టెస్ట్ సిరీస్‌లో ఎలా ఆడతాడో చూడాలి.