క్రీడాభూమి

ఒలింపిక్స్‌పైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర క్రీడా శాఖ 20 కొత్త నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను రూపొందించినట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్నారు. గతంలో ఉన్న కేంద్రాల మా దిరిగా కాకుండా అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందేలా చూస్తామన్నారు. ప్రతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి నిర్దిష్టంగా 4 నుంచి 6 క్రీడలకు నిధులను నిర్దేశించనున్నట్లు నిర్దేశిస్తుంది. క్యాంపస్‌లో శిక్షణను మెరుగు పర్చడం ద్వారా అథ్లెట్లకు ఎక్కువ ప్రదర్శనలిచ్చేందుకు ఆస్కారముందని, ప్రత్యే కంగా అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలతో మంచి శిక్షణ పొందే అవకాశం ఉందన్నారు. వీటితో పాటు మరిన్ని కేంద్రాల ను తెరిచేందుకు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌తో కలిసి పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్‌గా గుర్తించబడిన 20ఎస్‌ఏఐ సౌకర్యాలు గల కేంద్రాలను పాటియాలా, త్రివేండం, చండీగర్, సోనెపట్, లక్నో, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, భోపాల్, బెంగళూరు, ముంబయ, గాంధీ నగర్, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఢిల్లీ ఇందిరా స్టేడియం, ఢిల్లీ మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం, ఢిల్లీ డా.కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్, ఢిల్లీ డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్, నేషనల్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ( ఖేలో ఇండియా), రోహ్తక్, నేషనల్ రెజ్లింగ్ అకాడమీ (ఖేలో ఇండియా) ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు.
*చిత్రం... కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు