క్రీడాభూమి

గిల్, నాయర్ అర్ధ సెంచరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూర్, సెప్టెంబర్ 17: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు మ్యాచ్ లో భారత్ ఏ జట్టు బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడ డంతో మొదటి రోజు 3 వికెట్లను కోల్పోయ 233 పరుగులు చేసింది. అంతకుముం దు టాస్ గెలిచిన దక్షి ణాఫ్రికా జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయతే ఆదిలో నే లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఓపెనర్ అభిమ న్యూ ఈశ్వరన్ (5) వికెట్‌ను కోల్పోయన భారత్, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రియాంక్ పంచల్ (6) వికెట్ కూడా కొద్ది సమయంలోనే చేజార్చుకుంది. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, కరుణ్ నాయర్‌తో కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని, సెంచరీ దిశగా సాగుతున్న శుభ్‌మన్ గిల్ (92) సిపమ్లా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుది రిగాడు.
దీంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెర పడింది. వీరిద్దరూ కలిసి 135 పరు గులను జోడించారు. 166 పరుగులకే 3 కీలక వికెట్ల ను కోల్పోయన జట్టును వికెట్ కీపర్ వృద్ధి మాన్ సాహా (36, నాటౌట్)తో కలిసి నాయర్ (78, నాటౌట్) ముందుండి నడిపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత ఏ జట్టు మూడు వికెట్లను కోల్పోయ 233 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, వియాన్ మల్డర్, లుతో సిపమ్లా తలో వికెట్ తీశారు.
*చిత్రం...కరుణ్ నాయర్