క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఆలౌట్ 250

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 17: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 250 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం కొనసాగించి, 92 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 258 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా ఆసీస్ 94.3 ఓవర్లలో 250 పరుగులు చేసి, ఎనిమిది పరుగులు వెనుకపడింది. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్ మూడు, జొఫ్రా ఆర్చర్ రెండు చొప్పున వికెట్లు సాధించారు. ఇలావుంటే, మ్యాచ్‌లో మరొక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో, ఈ టెస్టు డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తున్నది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టును ఆస్ట్రేలియా 251 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో చోటు చేసుకున్న వైఫల్యాలు, లోపాలను గుర్తించిన ఇంగ్లాండ్ రెండో టెస్టులో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతోపాటు, రక్షణాత్మకంగా ఆడడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్నది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఫలితం వెలువడే అవకాశమే లేదు.