క్రీడాభూమి

మళ్లీ శాస్ర్తినే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఆగస్టు 16: టీమిండియా ప్రధాన కోచ్ పదవిపై ఉత్కంఠ వీడింది. ముంబయలోని బీసీసీఐ కార్యాలయంలో శుక్రవారం భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ నేతృత్వంలోని అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ ఆధారంగా మళ్లీ రవిశాస్ర్తీనే ఎంపిక చేస్తున్నట్లు క్రికెట్ సలహా కమిటీ అధికారికంగా ప్రకటించింది. మరో రెండేళ్లు రవిశాస్ర్తీ ఈ పదవిలో కొనసాగనున్నాడు. కొద్దిరోజుల క్రితం సుప్రీం కోర్టు నేతృత్వంలో ఏర్పాటైన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీకి ఈ బాధ్యతను అప్పగించింది. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దాదాపు 2వేల వరకు దరఖాస్తులు రాగా, కపిల్ కమిటీ ఆరుగురిని ఎంపిక చేసింది. ఇందులో రవిశాస్ర్తీతో పాటు రాబిన్ సింగ్, టామ్ మూడీ, మైక్ హెస్సన్, ఫిల్ సిమ్మన్స్, లాల్‌చంద్ రాజ్‌పుత్ ఉన్నారు.
ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కోచ్ ఫిల్ సిమన్స్ వ్యక్తిగత కారణాలతో ముంబయ లో జరిగిన ఇంటర్వ్యూకు హాజరు కాలేదు. దీంతో కమిటీ ముందు మొదటగా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ హాజరై ప్రజెంటేషన్ ఇవ్వగా, ఆ తర్వాత మైక్ హెసన్ హాజర య్యాడు. చివరగా వెస్టిండీస్‌లో పర్యటనలో ఉన్న కోచ్ రవి శాస్ర్తీ ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అయతే అందరితో ఇంటర్వ్యూ ముగిశాక కపిల్ నేతృత్వంలోని కమిటీ రవిశాస్ర్తీతో పాటు మైక్ హెసన్, టామ్ మూడీలను పరిగణలోకి తీసుకోగా, చివరగా రవిశాస్ర్తీకే పట్టం కట్టింది.
కోహ్లీతో స్నేహమే..
టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించే ముందుగానే అందరిలో తిరిగి రవిశాస్ర్తీకే పట్టం కడతారనే అభిప్రాయం ఉండేది. అందరూ ఊహించినట్లుగానే ఆ పదవి రవిశాస్ర్తీకే దక్కింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచి సంబంధాలే శాస్ర్తీని తిరిగి ప్రధాన కోచ్‌గా నియామకం కావడానికి సహకరించిందని పలువురు విశే్లషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే వెస్టిండీస్ పర్యటన కు బయల్దేరే ముందు కూడా కెప్టెన్ కోహ్లీ ‘రవిభాయ్ అయతే బాగుంటుంది’ అనే కామెంట్ కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. కపిల్ కమిటీ కూడా అందుకు అనుగుణంగానే కెప్టెన్, కోచ్‌ల మైత్రిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నాలుగోసారి..
రవిశాస్ర్తీ భారత జట్టుకు సేవలందించడం ఇది నాలుగో సారి. 2007లో బంగ్లాదేశ్ ప ర్యటనలో శాస్ర్తీ టీమిండియా క్రికెట్‌కు మేనేజర్‌గా సేవలం దించాడు. ఆ తర్వాత 2014- 16 వరకు టీమ్ డైరెక్టర్‌గా, 2017-19 వరకు ప్రధాన కోచ్ గా పనిచేశాడు. ప్రస్తుతం మ రో రెండేళ్ల పాటు ప్రధాన కోచ్ గా పదవీకాలం ఉండడంతో నాలుగు పర్యాయాలు భారత జట్టుకు సేవలందించిన ట్లయంది.