క్రీడాభూమి

భజరంగ్‌కు ఖేల్ రత్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియాను క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న వరించనుంది. ఈ ఏడాది జాతీయ పురస్కారాల కోసం మొత్తం 12మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను కేంద్ర క్రీడా శాఖ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ప్యానెల్ రెండ్రోజులు చర్చించి భజరంగ్ పూనియాకు ఖేల్త్న్ర అవార్డు ఇవ్వాలని నిర్ణయంచింది. గతేడాది జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 65 కేజీల విభాగం ఫ్రీ స్టైల్ ఈవెంట్, ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామనె్వల్త్ గేమ్‌లో స్వర్ణం సాధించాడు. అంతకుముందు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భజరంగ్‌కు ఖేల్ రత్న ఇవ్వాలిని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.