క్రీడాభూమి

నైట్ రైడర్స్ ప్రధాన కోచ్‌గా మెక్‌కలమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఆగస్టు 15: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండ న్ మెక్‌కలమ్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఎడిషన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్‌గా నియమించింది. మెక్‌కల్లామ్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మంచి అనుబంధం ఉంది. 2008 నుంచి 2010 వరకు, 2012-13 వరకు ఇదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాదు 2012 ఐపీఎల్ ఎడిషన్‌ను కేకేఆర్ గెలుచుకున్న జట్టులో సభ్యుడు కూడా. దీంతో పాటే నైట్ రైడర్స్‌కు చెందిన ట్రిన్‌బాగో (టీ కేఆర్) కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లోనూ మెక్‌కలమ్ సభ్యుడు. టీకేఆర్ 2017, 2018లలో సీపీఎల్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి చెందిన ఐపీఎల్, సీపీఎల్‌లో మెక్‌కలమ్ సేవలందిస్తాడని పేర్కొన్నాడు.