క్రీడాభూమి

శ్రేయాస్ స్థానం పదిలమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఆగస్టు 10: వెస్టిండీస్‌తో ఆదివారం రెండో వనే్డ ఇంటర్నేషనల్‌లో తలపడే టీమిండియా తుది జట్టులో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ చోటును నిలబెట్టుకుంటాడా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది. గయానాలో మొదటి వనే్డ 13 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్టులో శ్రేయాస్ ఉన్నాడు. కానీ, రెండో వనే్డలోనూ అతనికి అవకాశం ఇస్తారా? లేక లోకేష్ రాహుల్‌ను ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. నిజానికి ఒకటిరెండు మ్యాచ్‌ల ఆధారంగా ఒక ఆటగాడి సామర్థ్యాన్ని బేరీజు వేయడానికి వీల్లేదు. కానీ, ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న శ్రేయాస్‌కు తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కుతుందని చెప్పడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. నాలుగో స్థానం కోసం లోకేష్ రాహుల్‌తో శ్రేయాస్ పోటీపడాల్సి ఉంటుంది. గాయం కారణంగా శిఖర్ ధావన్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు దూరమైనప్పుడు, అతని స్థానంలో రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అటు ఓపెనర్‌గానూ, ఇటు నాలుగో స్థానంలోనూ బ్యాటింగ్‌కు దిగే సత్తా ఉందని అతను గతంలో ఎన్నో పర్యాయాలు నిరూపించుకున్నాడు. మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దుకాగా, మిగతా రెండు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి. రోహిత్, ధావన్‌లో ఎవరో ఒకరు అందుబాటులో లేకపోయినప్పుడు మాత్రమే రాహుల్, శ్రేయాస్ ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉండడానికి ఆస్కారం లభిస్తుంది. కానీ, ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేనందున, ఒకరు మాత్రమే తుది జట్టులో ఉంటారు. మొదటి వనే్డకు ఎంపిక చేసిన జట్టును అదే విధంగా కొనసాగించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే, శ్రేయాస్ అదృష్టవంతుడే అనుకోవాలి.
కేదార్ జాదవ్‌కు కూడా ఈ సిరీస్ అత్యంత కీలకంగానే పేర్కోవాలి. దినేష్ కార్తీక్ నిష్క్రమణతో, జాతీయ జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించే అవకాశం అతనికి వచ్చింది. అయితే, యువ సంచలనం శుభమ్ గిల్ నుంచి కేదార్‌కు గట్టిపోటీ ఎదురవుతున్నది. దీనికితోడు, జాదవ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ఖరారు చేయడంలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవి శాస్ర్తీ నానా ఇబ్బందులు పడుతున్నారు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం అతనికి లేదు. మిడిల్ ఆర్డర్‌లో క్రీజ్‌లోకి వస్తే, స్లాగ్ ఓవర్లలో పరుగుల వరద సృష్టించే సత్తా అతనికి లేదు. టాప్ ఆర్డర్ భారీగా పరుగులు చేస్తే, ఆతర్వాత తన వంతు పరుగులను అందించగలుగుతాడు. అవసరమైనప్పుడు అదనపు బౌలర్‌గా ఉపయోగపడడం ఒక్కటే అతనిని ఇంత వరకూ రక్షిస్తూ వస్తున్నది. అయితే, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటే, జాదవ్ అవసరం జట్టుకు ఉండకపోవచ్చు. మొత్తం మీద ఎన్ని అవకాశాలు ఇచ్చినా, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్న జాదవ్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడన్నది అనుమానమే.
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతినివ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే, నవ్‌దీప్ సైనీ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి రావడం ఖాయం. యుజువేంద్ర చాహల్‌ను తీసుకుంటే, పేసర్ ఖలీల్ అహ్మద్ తన స్థానాన్ని కోల్పోక తప్పదు. వర్షం కారణంగా మొదటి వనే్డ నిలిచిపోవడానికి ముందు, ఖలీల్ అహ్మద్ మూడు ఓవర్లు బౌల్ చేసి 27 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టు మేనేజ్‌మెంట్ అతనికి మరోసారి అవకాశం ఇస్తుందా అనేది చూడాలి.