క్రీడాభూమి

చండీమల్‌కు పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలొంబో, ఆగస్టు 9: మాజీ కెప్టెన్ దినేష్ చండీమల్‌కు శ్రీలంక క్రికెట్ జట్టు మళ్లీ పిలుపిచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగే మొదటి టెస్ట్‌లో భాగంగా 15మందితో కూడిన సభ్యు ల్లో చండీమల్ పేరును ఎంపిక చేసింది. దీంతో ఈ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఆరు నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగు పెట్టబోతున్నాడు. 29 ఏళ్ల చండీమల్ గతంలో ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ల్లో పేలవ ప్రదర్శన కార ణంగా జట్టుకు దూరమయ్యాడు. గాలే వేదికగా శ్రీలంక- న్యూజిలాండ్ మధ్య బుధవారం మొదటి టెస్టు జరగనుంది. అయతే 22న జరిగే రెండో టెస్టుకు మాత్రం లంక ఇప్పటికీ జట్టును ప్రకటించలేదు.
శ్రీలంక జట్టు: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), అంజిలో మాథ్యూస్, దినేష్ చండీమల్, లాహీరు తిరుమణ్ణే, కుసల్ మెండీస్, కుసల్ పెరీరా, నిరోషన్ డిక్వెల్లా, ధనుంజయ డీసిల్వా, అకిల ధనుంజయ, లసిత్ ఎంబుల్‌దెనియా, సురంగ లక్మల్, లాహీరు కుమార, ఓషాడ ఫెర్నాండో, లక్షన్ సందకన్, విశ్వ ఫెర్నాండో.