క్రీడాభూమి

ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 8: దక్షిణాఫ్రికాకు చెందిన స్పిన్నర్ కొలిన్ అకర్‌మన్ టీ20 మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నెల కొల్పాడు. ఒకే మ్యాచ్‌లో 18 పరు గులిచ్చి 7 వికెట్లను తీశాడు. 28 ఏళ్ల ఈ స్పిన్నర్ ఇంగ్లీష్ కౌంటీల్లో లిసెస్టర్ షైర్ తరఫున బరిలోకి దిగి గ్రేస్ రోడ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వార్విక్‌షైర్ జట్టు బ్యాట్స్‌మెన్లలో మైఖేల్ బర్గెస్, సామ్ హెయన్, విల్ రోడ్స్, లియామ్ బ్యాంక్స్, అలెక్స్ థామస్, హెన్రీ బ్రూక్స్, జీతన్ పటేల్ వికెట్లను తీశాడు. ఇంతకుముందు 2011లో మలేసియా బౌలర్ అరుల్ సుప్పయ్య సోమర్‌సెట్‌పై 5 పరుగు లిచ్చి 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించగా, దానిని కొలిన్ అకర్‌మన్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన లిసెస్టర్‌షైర్ జట్టు 190 పరుగులు చేయగా, వార్విక్‌షైర్ 134 పరుగులకే ఆలౌటైంది.