క్రీడాభూమి

బౌలింగ్ కోచ్‌కు జోషీ దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: భారత మాజీ క్రికెటర్, స్పిన్నర్ సునీల్ జోషీ టీమిండియా బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సంద ర్భంగా జోషీ మాట్లాడుతూ నేను భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు తన సేవలం దించానని, అక్కడ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించానని చెప్పు కొచ్చాడు. భారత్‌కు స్పెషలిస్ట్ స్పిన్ కోచ్ అవసరం లేదని తెలిసినా, తనను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. గతంలో మాజీ క్రికెటర్, టీమిండియా స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే హెడ్ కోచ్‌గా జట్టుకు సేవలందించిన విషయం తెలి సిందే. జోషీ 1996 నుంచి 2001 మధ్య కాలంలో భారత్ తరఫున ఆడా డు. 15 టెస్టుల్లో 41 వికెట్లు తీయగా, వనే్డల్లో 69 వికెట్లను పడగొట్టాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 160 మ్యాచ్‌ల్లో ఏకంగా 615 వికెట్లు తీశాడు. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్ వరకు జోషీ బంగ్లా దేశ్ జాతీయ, రంజీ జట్లకు సైతం కోచ్‌గా పనిచేశాడు. మెహిడీ హసన్ మిరాజ్, మోసదీక్ హుస్సేన్, షకీబుల్ హసన్ వంటి బౌలర్లు సునీల్ జోషీ కోచింగ్‌లోనే రాటు దేలారు.