క్రీడాభూమి

రిటైర్మెంట్ వ్యక్తిగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 21: రిటైర్మెంట్ అనేది ఆటగాడి వ్యక్తిగతమని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. వచ్చే నెల జరగనున్న వెస్టిండీస్ పర్యటనకు జట్టును ఎంపిక చేసేందుకు ముంబయి వచ్చిన ఆయన కొద్దిరోజులుగా భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేం ద్రసింగ్ ధోనీ విషయంలో వస్తున్న వార్తలపై స్పందించా డు. క్రికెటర్‌గా ధోనీ చేయాల్సిందంతా చేశాడని, రిటైర్మెం ట్ అనేది అతడి వ్యక్తిగతమని పేర్కొన్నాడు. విండీస్ టూ ర్‌కు ధోనీ ముందుగానే తను అందుబాటులో ఉండబో నని చెప్పినట్లు ఈ సందర్భంగా ప్రసాద్ పేర్కొన్నాడు. అయితే అతడు ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని, ఎప్పుడు రిటైర్ కావాలో ధోనీకి తెలుసని ఒక్క ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అయితే ధోనీ స్థానంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను విండీస్‌తో జరిగే మూడు ఫార్మట్లలో కొనసాగిస్తున్నట్లు వివరించాడు. రానున్న రోజులన్నీ యువ ఆటగాళ్లవేనని, అందుకు తగ్గ ట్లు వారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పాడు. మరోవైపు రిషభ్ పంత్‌పై భారం పడకుండా అతడికి ప్రత్యామ్నా యంగా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్‌లు ఉంటారన్నాడు.