క్రీడాభూమి

చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ రెండు గోల్స్ చేసిన మెస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 25: యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఫా) ఆధ్వర్యంలో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ బార్సిలోనా ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో గ్రూప్ టాపర్‌గా ఉన్న బార్సిలోనా 6-1 తేడాతో రోమాను చిత్తుచేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా లాస్ట్-16లో చోటు దక్కించుకుంది. స్టార్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, లూయిస్ సౌరెజ్ చెరి రెండు గోల్స్ చేసి బార్సిలోనాను తిరుగులేని ఆధిక్యంలో నిలిపారు. పిక్, ఆడియానో చెరొక గోల్ చేశారు. ఇలావుంటే బయెర్న్ మ్యూనిచ్ కూడా నాకౌట్ దశకు చేరింది. ఈ జట్టు 4-0 తేడాతో ఒలింపికాన్స్‌ను చిత్తుచేసింది. చిరకాల ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్‌ను 4-0 తేడాతో చిత్తుచేసిన తర్వాత బార్సిలోనా ఉత్సాహం మరింత పెరిగింది. గాయం కారణంగా సుమారు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న మెస్సీ మళ్లీ మైదానంలోకి దిగడంతో బార్సిలోనా బలం రెట్టింపైంది. రియల్ మాడ్రిడ్‌పై చక్కటి ఆటతో రాణించిన సౌరెజ్ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. విశ్రాంతి తర్వాత ఆడుతున్నప్పటికీ మెస్సీ కూడా అదే ఫామ్‌ను కొనసాగించాడు. వీరిద్దరి విజృంభణ బార్సిలోనాకు తిరుగులేని విజయాన్ని అందించింది.