క్రీడాభూమి

బంగ్లా క్రికెట్ జట్టు కివీస్ పర్యటన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చ్, మార్చి 15: న్యూజిలాండ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటక జట్టు బంగ్లాదేశ్ అర్ధంతరంగా తన పర్యటనను ముగించుకొని స్వదేశానికి తిరుగు ప్రయాణం కానుంది. శుక్రవారం బంగ్లా ఆటగాళ్లు ప్రార్థన కోసం హాగ్లీ ఓవల్ మైదానానికి సమీపంలో ఉన్న మసీదుకి వెళ్లారు. వీరు వెళ్లిన కొద్దిసేపటికే గుర్తు తెలియని దుండగులు మసీదులోకి చొరబడి కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న బంగ్లా క్రికెటర్లు ఈ ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. ‘తమ జట్టు సభ్యులమంతా ఉగ్రదాడి నుంచి క్షేమంగా బయటపడ్డాం. ఇదొక భయానక ఘటన. దయచేసి మా కోసం ప్రార్థనలు చేయండి’ అని బంగ్లాదేశ్ సినీయర్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు.
మ్యాచ్ రద్దుపై ఐసీసీ మద్దతు
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ హాగ్లీ పార్క్ ఆల్‌నూర్ మసీదు వద్ద శుక్రవారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుం ది. మ్యాచ్ రద్దు విషయమై బంగ్లా దేశ్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మద్దతుగా నిలిచింది. నెల రోజుల పర్య టనలో భాగంగా బంగ్లాదేశ్ మూడు వనే్డలు, మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. టూర్‌లో చివరి టెస్టు శనివారం జరగనుందని, ఉగ్రదాడి నేపథ్యంలో బంగ్లా జట్టు తప్పుకోవడం సరైనదేనని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు.