క్రీడాభూమి

న్యూజిలాండ్‌దే సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డునేదిన్, ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వనే్డలోనూ న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వనే్డల సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బం గ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన లలో కొలిన్ మున్రో (8) ను తొందరగానే పెవిలియన్ పంపి న బంగ్లా బౌలర్లు మరి కొద్దిసేపటికే మార్టిన్ గప్టిల్ (20) ను కూడా అవుట్ చేశారు. 59 పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయన న్యూజిలాండ్‌ను హెన్రీ నికోలస్ (64), రాస్ టేలర్ (69), కెప్టెన్ టామ్ లాథమ్ (59) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. చివరగా జేమ్స్ నీషమ్ (37), కొలిన్ డీ గ్రాండ్ హోం (37) కూడా చెలరేగడంతో ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయ 330 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ లిటాన్ దాస్ (1), సౌమ్య సర్కార్ (0), ముషిఫికర్ రహమన్ (17), మహమ్మదుల్లా (16) వెనువెంటనే పెవిలియన్ చేరి నిరాశపరిచారు. ఈ క్రమంలో షబ్బీర్ రహమన్ (102), మహమ్మద్ సైఫుద్దీన్ (44) రాణించారు. సెంచరీ సాధించి జోరుమీదున్న షబ్బీర్ రహమన్ సౌథీ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా, సైఫుద్దీన్‌ను బౌల్ట్ అవు ట్ చేశాడు. చివర్లో మెహిడి హసన్ (37) కాస్త ఫర్వాలే దనిపించినా 47.2 ఓవర్లలో 242 పరుగులకే బంగ్లాదేశ్ కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీకి 6 వికెట్లు దక్కగా, ట్రెంట్ బౌల్ట్ 2, కొలిన్ డీగ్రాండ్ హోంకి వికెట్ లభించింది.
చిత్రం.. సిరీస్‌తో న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు