క్రీడాభూమి
వివక్ష ఎందుకు?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొచ్చి, నవంబర్ 25: బాలురు, బాలికలకు వేరువేరు కేంద్రాల్లో విడివిడిగా పోటీలను నిర్వహించాలని భారత పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్‌జిఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయంపై మాజీ అథ్లెట్ పిటి ఉష ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివక్ష ఎందుకని అధికారులను నిలదీసింది. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీసహా అన్ని దేశాల్లోనూ క్రీడా సంఘాలు, సమాఖ్యలు ఒకే వేదికపైనే బాలురు, బాలికలు లేదా పురుషులు, మహిళలకు పోటీలను నిర్వహిస్తున్నాయని ఆమె పేర్కొంది. లింగ వివక్ష ఉండరాదని ప్రపంచం మొత్తం కోరుతుంటే, ఎస్‌జిఎఫ్‌ఐ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, ఈనెల చివరి వారంలో పుణెలో, వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో నాసిక్‌లో బాలురు, బాలికలకు వేరువేరుగా పోటీలను నిర్వహించాలని నిర్ణయించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాని వెంటనే ఈ అంశంపై జోక్యం చేసుకొని, ఒక వేదికపై పోటీలు జరిగేలా చూడాలని కోరింది. దీని వల్ల అమ్మాయల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపింది.
అండర్-19 ట్రైసిరీస్
ఫైనల్‌కు బంగ్లాదేశ్
కోల్‌కతా, నవంబర్ 25: అండర్-19 క్రికెట్ ట్రైసిరీస్ టైటిల్ కోసం భారత్‌తో పోరాటాన్ని బంగ్లాదేశ్ ఖరారు చేసుకుంది. బుధవారం జరిగిన తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఈ జట్టు అఫ్గానిస్థాన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ స్పిన్నర్ సరుూద్ సర్కార్ కేవలం ఆరు పరుగులకే మూడు వికెట్లు పడగొట్టగా, ఎడమచేతి వాటం స్పిన్నర్ సలే అహ్మద్ షావన్ గాజీ 32 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. వీరి బౌలింగ్ ముందు నిలవలేకపోయిన అఫ్గాన్ 26.2 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. తారిక్ స్టానిక్‌జయ్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో అఫ్గాన్ వంద పరుగులు మైలురాయిని కూడా చేరలేకపోయింది. సర్కార్, షావన్ గాజీ చెరి మూడు వికెట్లు సాధించి అఫ్గాన్‌ను కుప్పకూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 7.2 ఓవర్లలో 29 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. అయితే, నజాముల్ హొసేన్ షంటో (38 నాటౌట్), మెహెదీ హసన్ (37 నాటౌట్) మూడో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించి బంగ్లాదేశ్‌ను గెలిపించారు. కాగా, పోటీ నుంచి నిష్క్రమించిన అఫ్గాన్ ఈనెల 27న తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌ను ఢీ కొంటుంది. 29న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది.
గోవా, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా
గోవా, నవంబర్ 25: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో బుధవారం ఢికొన్న గోవా ఫుట్‌బాల్ క్లబ్, నార్త్‌ఈస్ట్ యునైటెడ్ డ్రాతో సంతృప్తి చెందాయి. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి. ఇరు జట్లు మ్యాచ్ ఆరంభం నుంచి డిఫెన్స్‌కు అంకితం కావడంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో నార్త్‌ఈస్ట్ ఆటగాడు బెనార్డ్ మెండీ గోల్ సాధించగా, 80వ నిమిషంలో గోవాకు రినాల్డో ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. ఇలావుం టే డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా పాయంట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
రంజీ ట్రోఫీ క్రికెట్
రైల్వేస్ చేతిలో ఆంధ్ర చిత్తు
న్యూఢిల్లీ, నవంబర్ 25: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో రైల్వేస్‌ను ఢీ కొన్న ఆంధ్ర జట్టు 148 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులు సాధించగా, ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ కేవలం 114 పరుగులకే ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 68 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన రైల్వేస్ రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులు సాధించి, ప్రత్యర్థి ముందు 273 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని అందుకోవడానికి రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆంధ్ర 64.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఒడిశాను బెంగాల్ (గ్రూప్ ‘ఎ’) 133 పరుగుల తేడాతో ఓడించింది. గ్రూప్ ‘బి’లో ముంబయి మూడు వికెట్ల తేడాతో మధ్య ప్రదేశ్‌పై గెలిచింది. గ్రూప్ ‘సి’లో జరిగిన ఒక మ్యాచ్‌లో సౌరాష్టప్రై కేరళ 45 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. జార్ఖండ్ ఇన్నింగ్స్ 71 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌ను చిత్తుచేసింది.