క్రీడాభూమి

పుణెకు మరో దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, మే 2: మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ గాయం కారణంగా ఐపిఎల్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే కెవిన్ పీటర్సన్, ఫఫ్ డు ప్లెసిస్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సేవలను పుణె కోల్పోయింది. స్మిత్ ఇప్పుడు ఆ జాబితాలో చేరాడు. సుమారు వారం రోవజులుగా అతను చేతి మణికట్టు నొప్పితో బాధపడుతున్నాడని, పరీక్షల అనంతరం విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ మేనేజర్ అలెక్స్ రౌంటొరిస్ ఒక ప్రకటనలో తెలిపారు. స్మిత్ గాయం తీవ్రమైనదేమీ కాదని, అయితే, జూన్ 6 నుంచి వెస్టిండీస్‌లో జరిగే ముక్కోణపు వనే్డ సిరీస్‌లో పాల్గొనేందుకు వీలుగా అతనికి విశ్రాంతి అవసరమని వివరించాడు. ఈసారి ఐపిఎల్‌లో గుజరాత్ లయన్స్‌తోపాటు కొత్తగా అడుగు పెట్టిన రైజింగ్ పుణెను పరాజయాలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరం కావడంతో సమస్యలు మరింతగా పెరిగాయి. పీటర్సన్, డు ప్లెసిస్ గాయాలతో వైదొలగినప్పుడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజాను జట్టులోకి తీసుకోవాలని పుణె ఫ్రాంచైజీ నిర్ణయించింది. తాజాగా మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్‌లకు బదులుగా ఎవరిని తీసుకుంటారన్న విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
రైజింగ్ పుణె సూపర్‌జెయంట్స్ జట్టు ఇప్పటి వరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలను నమోదు చేసింది. ఆరు పరాజయాలను ఎదుర్కొంది.