క్రీడాభూమి

రద్వాన్‌స్కా నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 2: ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహక ఈవెంట్‌గా పేర్కొనే మాడ్రిడ్ ఓపెన్ నుంచి టాప్ సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ చివరి క్షణంలో వైదొలగడంతో, టాప్ సీడింగ్ పోలాంగ్‌కు చెందిన రద్వాన్‌స్కాకు దక్కింది. టైటిల్ సాధించే అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయని క్రీడాపండితులు జోస్యం చెప్పారు. కానీ, మొదటి రౌండ్‌లో డొమినికా సిబుల్కొవా (స్లొవేకియా)ను ఢీకొన్న ఆమె 4-6, 3-6 తేడాతో ఓటమిపాలైంది. 2012లో మొదటిసారి 2014లో రెండోసారి సుమీ ఫైనల్ వరకూ చేరిన రద్వాన్‌స్కా ఒక్కసారి కూడా టైటిల్ దక్కించుకోలేకపోయింది. ఇలావుంటే రెండో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన ఆంజెలిక్ కెర్బర్ కూడా మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. ఆమెను చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బొరా స్ట్రయికోవా 6-4, 6-2 తేడాతో చిత్తుచేసి ముందంజ వేసింది. స్టట్‌గార్డ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా పోటీకి దిగి, టైటిల్‌ను నిలబెట్టుకున్న కెర్బర్ వారం రోజుల వ్యవధిలోనే దారుణంగా విఫలం కావడం గమనార్హం. కాగా, మొదటి, రెండు సీడింగ్ క్రీడాకారిణులు నిష్క్రమించగా, ప్రస్తుతం పోటీలో ఉన్న వారిలో అత్యుత్తమ సీడింగ్‌గల క్రీడాకారిణిగా గార్బినే ముగురుజా కొనసాగుతున్నది. ఆమె తొలి రౌండ్‌లో అన్నా షిమిడ్లొవాపై 6-2, 7-5 ఆధిక్యంతో విజయభేరి మోగించింది. లారా రాబ్సన్‌పై ప్రపంచ మాజీ నంబర్ వన్ విక్టోరియా అజరెన్కా 6-4, 6-2, లారా అరుబరెనాపై పెట్రా క్విటోవా 6-3, 6-2, తొమ్మిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవాపై క్వాలిఫయర్ లారా సీగెమండ్ 6-0, 3-6, 6-3, కాతెరీన సినియాకొవాపై అనా ఇవానోవిచ్ 6-3, 3-6, 6-4 తేడాతో విజయాలను నమోదు చేశారు.

చిత్రం మాడ్రిడ్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఓడిన రద్వాన్‌స్కా