క్రీడాభూమి

నైట్ రైడర్స్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: హోం గ్రౌండ్‌లో శనివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) గ్రూప్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ 27 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. కరుణ్ నాయక్, బిల్లింగ్స్ అర్ధ శతకాలతో రాణించడంతో డేర్‌డెవిల్స్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేయగలిగింది. అనంతరం నైట్ రైడర్స్‌ను 18.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ చేసింది. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న కార్లొస్ బ్రాత్‌వెయిట్ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. 11 బంతుల్లోనే 34 పరుగులు చేసిన అతను చక్కటి బౌలింగ్ ప్రతిభ కనబరచి, మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టాస్ గెలిచి నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్ దారుణంగా ఆరంభమైంది. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి శ్రేయాస్ అయ్యర్ (0)ను ఎల్‌బిగా అవుట్ చేసిన ఆండ్రె రసెల్ ఐదో బంతిలో క్వింటన్ డికాక్ (1)ను బ్రాడ్ హాగ్ క్యాచ్ అందుకోగా పెవిలియన్‌కు పంపాడు. యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ 15 బంతుల్లో 15 పరుగులు చేసి సునీల్ నారైన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో డేర్‌డెవిల్స్‌ను కరుణ్ నాయర్, శామ్ బిల్లింగ్స్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. నాయర్ 50 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 68 పరుగులు సాధించి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు. అదే ఓవర్‌లో క్రిస్ మోరిస్‌ను ఉమేష్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈదశలో బ్రాత్‌వెయిట్‌తో కలిసి పోరాటాన్ని కొనసాగించిన బిల్లింగ్స్ 34 బంతుల్లో 54 పరుగులు సాధించి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 11 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్ల సాయతో 34 పరుగులు చేసి బ్రాత్‌వెయిట్‌ను సునీల్ నారైన్ క్యాచ్ అందుకోగా ఆండ్రె రసెల్ అవుట్ చేశాడు. చివరి ఓవర్ చివరి బంతికి వృషభ్ పంత్ (4) రనౌటయ్యాడు. 20 ఓవర్లలో డేర్‌డెవిల్స్ 8 వికెట్లు చేజార్చుకొని 186 పరుగులు చేయగా, ఒక బంతిని ఎదుర్కొన్న మహమ్మద్ షమీ పరుగుల ఖాతాను తెరవకుండా నాటౌట్‌గా ఉన్నాడు.
ఉతప్ప ఒంటరి పోరాటం
రాబిన్ ఉతప్ప ఒంటరి పోరాటాన్ని కొనసాగించి అర్ధ శతకాన్ని సాధించినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో నైట్ రైడర్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 159 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ గౌతం గంభీర్ (6), బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన పీయూష్ చావ్లా (8), హార్డ్ హిట్టర్ యూసుఫ్ పఠాన్ (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. వేగంగా పరుగులు రాబట్టడంలో దిట్టగా పేరుపొందిన సూర్య కుమార్ యాదవ్ 13 బంతుల్లో 21 పరుగులు చేసి బ్రాత్‌వెయిట్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సతీష్ 6, ఆండ్రె రసెల్ 17 పరుగులు చేసి వెనుదిరిగారు. జాసన్ హోల్డర్ మొదటి బంతిలోనే పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసిన రాబిన్ ఉతప్ప 52 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 72 పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్‌కు చిక్కాడు. ఉమేష్ యాదవ్ (2), సునీల్ నారైన్ (0) రెండు వరుస బంతుల్లో అవుటయ్యారు. 18.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్‌కాగా, ఒక్క బంతిని కూడా ఎదుర్కొనే అవకాశం దక్కని బ్రాడ్ హాగ్ నాటౌట్‌గా నిలిచాడు. నై ట్ రైడర్స్ తన లక్ష్యానికి 28 పరుగుల దూ రంలో నిలిచిపోయంది.

సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 (కరుణ్ నాయర్ 68, శామ్ బిల్లింగ్స్ 54, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 34, ఆండ్రె రసెల్ 3/26, ఉమేష్ యాదవ్ 3/33).
కోల్‌కతా నైట్ రైడర్స్: 18.3 ఓవర్లలో ఆలౌట్ 159 (రాబిన్ ఉతప్ప 72, సూర్యకుమార్ యాదవ్ 21, రసెల్ 17, జహీర్ ఖాన్ 3/21, బ్రాత్‌వెయిట్ 3/47).

* కరుణ్ నాయర్ తన 30 ఐపిఎల్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యుత్తమ స్కోరు సాధించాడు. 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై అజేయంగా 73 పరుగులు చేసిన అతను ఇప్పుడు అదే జట్టు తరఫున ఆడుతూ 68 పరుగులు చేశాడు.
* కరుణ్ నాయర్, శామ్ బిల్లింగ్స్ 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. డేర్‌డెవిల్స్‌కు ఈ ఐపిఎల్‌లో ఇది రెండో సెంచరీ పార్ట్‌నర్‌షిప్. అంతకు ముందు క్విండన్ డి కాక్‌తో కరుణ్ నాయర్ 134 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

* క్వింటన్ డి కాక్ గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 9, 5, 1 చొప్పున పరుగులు చేశాడు. ఐపిఎల్‌లో అతను ఆడిన మొదటి మూడు ఇన్నింగ్స్‌లో 17, 59 (నాటౌట్), 108 చొప్పున పరుగులు సాధించాడు. అతను ఫామ్ కోల్పోయాడని ప్రస్తుత స్కోర్లు స్పష్టం చేస్తున్నాయి.
* కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేసిన రాబిన్ ఉతప్ప 72 పరుగులు చేసే క్రమంలో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. ఐపిఎల్‌లో వంద లేదా అంతకు మించి సిక్సర్లు కొట్టిన 14వ బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు.
* ఉతప్ప ఐపిఎల్ మొదటి ఆరు సీజన్లలో 86 ఇన్నింగ్స్ ఆడి ఎనిమిది అర్ధ శతకాలు సాధించాడు. ఆతర్వాత మూడు ఐపిఎల్స్‌లో అతను తాజా ఇన్నింగ్స్‌తో కలిపి 8 హాఫ్ సెంచరీలు చేశాడు.

డేర్‌డెవిల్స్
టాప్ స్కోరర్ కరుణ్ నాయర్
(68 పరుగులు)

ఢిల్లీ డేర్‌డెవిల్స్ మొదటి ఆరు ఓవర్లలో కేవలం 37 పరుగులు చేసింది. చివరి ఆరు ఓవర్లలో 80 పరుగులు సాధించింది. మధ్యలో ఎనిమిది ఓవర్లలో 69 పరుగులను నమోదు చేసింది.

ఐపిఎల్‌లో నేడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాజ్‌కోట్‌లో సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే మొదటి మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు ఢీ కొంటాయి. పంజాబ్‌పై గుజరాత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, రాత్రి 8 గంటలకు మొదలయ్యే మరో మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో ముంబయిని ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు.