క్రీడాభూమి

సన్‌రైజర్స్ ఖాతాలో మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: హోం గ్రౌండ్‌లో శనివారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఢీకొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. రాజ్‌కోట్‌లో గుజరాత్ లయన్స్‌ను పది వికెట్ల తేడాతో చిత్తుచేసిన సన్‌రైజర్స్ అదే దూకుడును కొనసాగించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి అర్ధ శతకంతో రాణించాడు. శిఖర్ ధావన్ అతనికి చక్కటి మద్దతునిచ్చాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 143 పరుగుల చేయగా, సన్‌రైజర్స్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే, ఐదు వికెట్లకు 146 పరుగులు సాధించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 14 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్‌ను మురళీ విజయ్ రూపంలో కోల్పోయింది. అతను రెండు పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నమన్ ఓఝా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. మానన్ వోహ్రా 23 బంతుల్లో 25 పరుగులు చేసి రనౌట్‌కాగా, కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (9), హార్డ్ హిట్టర్ గ్లేన్ మాక్స్‌వెల్ (1) ఒకరితర్వాత మరొకరిగా పెవిలియన్ చేరారు. టాప్ స్కోరర్ షాన్ మార్ష్ 34 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 40 పరుగు సాధించి ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో బంతిని అర్థం చేసుకోలేక, వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు. చివరిలో నిఖిల్ నాయక్ (22), అక్షర్ పటేల్ (36 నాటౌట్) సన్‌రైజర్స్ బౌలింగ్‌ను కొంత వరకు సమర్థంగా ఎదుర్కొని స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఆరో వికెట్‌కు వీరు 50 పరుగుల అత్యంత కీలక భాగస్వామ్యాన్ని అందించడంతో పంజాబ్ కొంత వరకైనా కోలుకుంది. ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేయగా, అప్పటికి అక్షర్ పటేల్‌తోపాటు రిషీ ధావన్ (3) క్రీజ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లు ముస్త్ఫాజుర్ రహ్మాన్, మోజెస్ హెన్రిక్స్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. ముస్త్ఫాజుర్ నాలుగు ఓవర్లలో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.
హోం గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి రెచ్చిపోయాడు. 23 బంతుల్లోనే అర్థ శతకాన్ని సాధించాడు. 31 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసిన అతనిని డేవిడ్ మిల్లర్ క్యాచ్ అందుకోగా సందీప్ శర్మ అవుట్ చేశాడు. సన్‌రైజర్స్ 90 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతికే ఆదిత్య తారే (0) రనౌటయ్యాడు. వార్నర్‌కు చక్కటి సహకారాన్ని అందించిన శిఖర్ ధావన్ 44 బంతుల్లో 45 పరుగులు సాధించి, రిషీ ధావన్ బౌలింగ్‌లో నిఖిల్ నాయక్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఇయాన్ మోర్గాన్ నాలుగో వికెట్‌కు దీపక్ హూడాతో కలిసి 24 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి అవుటయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో అతను మానన్ వోహ్రాకు దొరికిపోయాడు. తర్వాతి బంతికే దీపక్ హూడా (5) రనౌటయ్యాడు. అప్పటికి సన్‌రైజర్స్ విజయానికి ఐదు పరుగుల దూరంలో ఉంది. మోజెస్ హెన్రిక్స్ (5 నాటౌట్), నమన్ ఓఝా (2 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జట్టును లక్ష్యానికి చేర్చారు. సన్‌రైజర్స్ 17.5 ఓవర్లలో, ఐదు వికెట్లకు 146 పరుగులు చేసి, ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.
సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 143 (షాన్ మార్ష్ 40, మానన్ వోహ్రా 25, నిఖిల్ నాయక్ 22, అక్షర్ పటేల్ 36, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/9, మోజెస్ హెన్రిక్స్ 2/33).
సన్‌రైజర్స్ హైదరాబాద్: 17.1 ఓవర్లలో 5 వికెట్లకు 146 (డేవిడ్ వార్నర్ 59, శిఖర్ ధావన్ 45, ఇయాన్ మోర్గాన్ 25).

చిత్రం 31 బంతుల్లో 59 పరుగులు చేసిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్