క్రీడాభూమి

సన్‌రైజర్స్‌లో రెట్టించిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: గుజరాత్ లయన్స్‌ను గురువారం జరిగిన మ్యాచ్‌ని పది వికెట్ల తేడాతో చిత్తుచేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెట్టించిన ఉత్సాహంతో శనివారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో పోరాటానికి సిద్ధమైంది. డేవిడ్ వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ, అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండగా, శిఖర్ ధావన్ మళ్లీ ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది. ఈటోర్నీ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసిన ఈ జట్టు ఆతర్వాత ఎదుదాడికి దిగి, డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను ఏడు వికెట్లు, తాజాగా గుజరాత్ లయన్స్‌ను పది వికెట్ల తేడాతో ఓడించింది. వార్నర్, ధావన్‌తోపాటు మోజెస్ హెన్రిక్స్, ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, భువనేశ్వర్ కుమార్, ముస్త్ఫాజుర్ రెహ్మాన్, బరీందర్ శరణ్ బౌలింగ్‌లో జట్టుకు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ఇద్దరుముగ్గురిని మినహాయిస్తే సన్‌రైజర్స్‌లో గొప్పస్టార్లు ఎవరూ లేరు. కానీ, సమష్టి పోరాటంతో ఈ జట్టు విజయాలను నమోదు చేస్తున్నది.
డేవిడ్ మిల్లర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వైఫల్యాల బాటలో సాగుతున్నది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈజట్టు కేవలం రెండు పాయింట్లు సంపాదించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మురళీ విజయ్, మానన్ వోహ్రా, షాన్ మార్ష్, గ్లేన్ మాక్స్‌వెల్, మోహిత్ శర్మ, గుర్‌కీరత్ సింగ్ మాన్, మిచెల్ జాన్సన్ తదితరులు తమ స్థాయికి తగిన ఆటతో రాణించకపోతే, సన్‌రైజర్స్ చేతిలో పంజాబ్‌కు పరాభవం తప్పదు.
మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు ఆరంభం.