క్రీడాభూమి

వెల్‌డన్ వార్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా గురువారం ఇక్కడ గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. డేవిడ్ వార్నర్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి శిఖర్ ధావన్ చక్కటి మద్దతునిచ్చాడు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి, గుజరాత్ నిర్దేశించిన 136 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 31 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. అంతకు ముందు సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేసి గుజరాత్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. అతని ప్రతిభ వల్లే గుజరాత్ 135 పరుగులకు పరిమితమైంది. ఆతర్వాత సన్‌రైజర్స్ ఓపెనర్లు వార్నర్, ధావన్ ఒక్క వికెట్ కూడా పడకుండా జట్టును లక్ష్యానికి చేర్చారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ తన ప్రత్యర్థిని 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 135 పరుగులకే కట్టడి చేసింది. భువనేశ్వర్ కుమార్ 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూల్చడంతో గుజరాత్ లయన్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. కెప్టెన్ సురేష్ రైనా 51 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లతో 75 పరుగులు సాధించాడు. టి-20 ఫార్మెట్‌లో 6,000 లేదా అంతకు మించి పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల పుస్తకంలో చోటు సంపాదించాడు. అతనితోపాటు బ్రెండన్ మెక్‌కలమ్ (14), రవీంద్ర జడేజా (14) మాత్రమే గుజరాత్ తరఫున రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్స్‌కే పరిమితమై అభిమానులను నిరాశపరిచారు. భువీకి నాలుగు వికెట్లు లభించగా, బరీందర్ శరణ్, ముస్త్ఫాజుర్ రహ్మాన్, దీపక్ హూడా, బిపుల్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను డేవిడ్ వార్నర్ మరోసారి శాసించాడు. 29 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసిన అతను శిఖర్ ధావన్‌తో కలిసి జట్టు స్కోరును 11 ఓవర్లలో వంద పరుగులకు చేర్చాడు. వార్నర్ విజృంభించి ఆడుతుండగా, ధావన్ తనదైన ఆటకు భిన్నంగా ఆచితూచి బ్యాటింగ్ చేయడం గమనార్హం. వార్నర్ 48 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లతో 74, ధావన్ 41 బంతులు ఎదుర్కొని, 5 ఫోర్లతో 53 చొప్పున పరుగులు చేసి, సన్‌రైజర్స్‌ను పది వికెట్ల తేడాతో గెలిపించారు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ లయన్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 (సురేష్ రైనా 75, బ్రెండన్ మెక్‌కలమ్ 18, రవీంద్ర జడేజా 14, భువనేశ్వర్ కుమార్ 4/29).
సన్‌రైజర్స్ హైదరాబాద్: 14.5 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా 137 (డేవిడ్ వార్నర్ 74 నాటౌట్, శిఖర్ ధావన్ 53 నాటౌట్).