క్రీడాభూమి

స్నోబోర్డింగ్ ప్రపంచ చాంపియన్ ఎస్టెల్ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్సిరెస్ (స్విట్జర్లాండ్), ఏప్రిల్ 20: ఎక్‌స్ట్రీమ్ స్నోబోర్డింగ్ ప్రపంచ చాంపియన్ ఎస్టెల్ బాలెట్ ఒక చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూ మంచి తుపానులో చిక్కుకొని దుర్మరణం చెందింది. 21 ఏళ్ల ఎస్టెల్ రక్షణ కవచాలను ధరించి స్నోబోర్డింగ్ చేస్తున్నదని, కానీ, హఠాత్తుగా విరుచుకుపడిన మంచు తుపానులో చిక్కుకుందని వలాయిస్ రాష్ట్ర పోలీస్ అధికారులు తెలిపారు. తక్షణమే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని, కానీ, అప్పటికే ఆమె మృతి చెందిందని అన్నారు. రెండు రోజుల క్రితమే షూటింగ్ గురించి ఎస్టెల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మెసేజ్ పెట్టింది. చాలా ఉత్సాహంగా తాను షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ఆ షూటింగ్‌లోనే ఆమె మృతి చెందడం దురదృష్టకరం.