క్రీడాభూమి

హెచ్‌ఐఎల్ వేలంలో ఆకాశ్‌కు రూ. 55 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలంలో భారత ఆటగాళ్లలో ఆకాశ్‌దీప్ సింగ్‌కు అత్యధికంగా 55 లక్షల రూపాయలు లభించాయి. మొత్తం మీద ఈ వేలంలో జర్మనీకి చెందిన మోరిజ్ ఫ్యూసే అత్యధిక ధరతో కొత్త రికార్డు నెలకొల్పాడు. హెచ్‌ఐఎల్ చరిత్రలో లక్ష డాలర్లు పలికిన తొలి ఆటగాడిగా సంచలనం సృష్టించాడు. భారత జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్, ఆస్ట్రేలియా వెటరన్ జమీ డ్వెయిర్ వంటి హేమాహేమీల కంటే ఆకాశ్‌కు ఎక్కువ ధర పలకడం విశేషం. మొత్తం 277 మంది ఆటగాళ్లకు వేలంలో చోటు దక్కింది. వీరిలో భారతీయులు 135 మందికాగా, మిగతా 142 మంది విదేశీయులు. భారీగా ధర పలుకుతుందని అనుకున్నప్పటికీ సర్దార్‌కు 58,000 డాలర్లు మాత్రమే లభించాయి. 23 ఏళ్ల ఆకాశ్ 84,000 డాలర్లతో సర్దార్ కంటే ముందుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డ్వెయర్ 57,000 డాలర్లతో సరిపుచ్చుకున్నాడు. ఆకాశ్ తర్వాత మన దేశం తరఫున గుర్మెయిల్ సింగ్‌కు ఎక్కువ మొత్తం, 81,000 డాలర్లు (సుమారు 53.5 లక్షల రూపాయలు) దక్కాయి. గురీందర్ సింగ్‌కు 75,000 డాలర్లు (సుమారు 49.6 లక్షల రూపాయలు) లభించాయి. మన్దీప్ సింగ్ 70,000 డాలర్లు (సుమారు 46.3 లక్షల రూపాయలు), నికిన్ తిమ్మయ్య 67,000 డాలర్లు (సుమారు 44.3 లక్షల రూపాయలు) దక్కించుకున్నారు. డ్రాగ్ ఫ్లికర్ రూపీందర్‌పాల్ సింగ్‌కు 68,000 డాలర్లు (సుమారు 44.98 లక్షల రూపాయలు), స్ట్రయికర్ ధరమ్‌వీర్ సింగ్‌కు 60,000 డాలర్లు (39.69 లక్షల రూపాయలు) లభించాయి.