క్రీడాభూమి

అజ్లాన్‌షా సుల్తాన్ ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇఫో (మలేసియా), ఏప్రిల్ 16: ప్రతిష్టాత్మకమైన సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించాలన్న భారత జట్టు ఆశలపైప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా నీళ్లుచల్లింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 4-0 గోల్స్ తేడాతో నారత్‌ను చిత్తు చేసి టైటిల్‌ను దక్కించుకోగా, భారత్ రజత పతకంతో సంతృప్తి చెందింది. అయితే ఈ టోర్నమెంట్‌లో భారత్ ఆరేళ్ల తర్వాత రజత పతకం సాధించడం ఇదే తొలిసారి. కాగా, ఆస్ట్రేలియా ఈ టైటిల్‌ను దక్కించుకోవడం ఇది తొమ్మిదోసారి. 2010లో చివరిసారిగా భారత్ ఈ టైటిల్‌ను దక్కించుకుంది. అప్పుడు దక్షిణ కొరియాతో భారత జట్టు సంయుక్త విజేతగా నిలిచింది. కాగా, 2012,2015లో భారత్ కాంస్య పతకాలను దక్కించకుంది. ఆస్ట్రేలియా జట్టులో థామస్ క్రైగ్, మాట్ ఘోడ్స్‌లు చెరి రెండు గోల్స్ సాధించి తమ జట్టుకు విజయాన్ని అందించారు. అయితే తొలి క్వార్టర్‌లో భారత జట్టు డిఫెన్స్ కారణంగా ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్‌పై దాడి చేయలేక పోయింది. అయితే 25, 35 నిమిషాల్లో క్రైగ్ రెండు ఫీల్డ్ గోల్స్ చేసి జట్టుకు తిరుగులేని ఆధిక్యత సాధించి పెట్టాడు. ఆ తర్వాత ఘోడ్స్ 43,57 నిమిషాల్లో మరో రెండుగోల్స్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్‌లో ఆడిన మొత్తం ఏడు మ్యాచ్‌లలోను విజయం సాధించడం గమనార్హం. రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో ఆ జట్టు భారత్‌ను 5-1 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. ప్రారంభంలో ఒక వ్యూహం ప్రకారం ఆడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థిని తొలి క్వార్టర్‌లో తమ అర్ధ భాగానికే పరిమితం చేశారు. అంతేకాదు రెండు సార్లు ప్రత్యర్థి కోటను ఛేదించుకుని గోల్ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఆస్ట్రేలియాకు ఒక పెనాల్టీ కార్నర్ దక్కినా జెరెమీ హేవర్డ్ కొట్టిన షాట్ గోల్‌కు దూరంగా వెళ్లింది. దాదాపు 25 నిమిషాల పాటు భారత్ ప్రతిఘటన సాగింది కానీ ఆ తర్వాత ఆటగాళ్లు అలసిపోయినట్లు కనిపించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆస్ట్రేలియా ఎదురుదాడికి దిగింది, భారత్‌కు గోల్ చేయడానికి రెండు మూడు అవకాశాలు దక్కినప్పటికీ ఆస్ట్రేలియా గోల్‌కీపర్, డిఫెండర్లు వాటిని వృథా చేశారు.