క్రీడాభూమి

సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ ముగిసిన భారత్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఏప్రిల్ 14: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మిం టన్ టోర్నమెంట్‌లో భారత్ పోరు రెండో రౌండ్‌తోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో టైటిల్ సాధిస్తుందనుకున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్ సమస్య కారణంగా చివరి క్షణాల్లో వైదొలగిన విష యం తెలిసిందే. దీనితో భారత్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించిన తెలుగు తేజం పివి సింధు రెండో రౌండ్‌లో నే ఓటమిపాలైంది. ఆమెను హీ బింగ్‌జియావో 11-21, 21-14, 21-14 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌లో గొప్పగా ఆడిన సింధు ఆతర్వాత అదే స్థాయలో రాణించలేకపోయంది. మిగతా రెండు సె ట్లలో అనుకున్న రీతిలో పోటీని ఇవ్వలేక ఓటమిపాలైంది. పురుషు ల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్, ప్రణవ్ జె చోప్రా పోరాటం కూడా ముగిసింది. వీరిపై హెంద్రా సితియవాన్, మహమ్మద్ అషాన్ జోడీ 21-12, 21-12 ఆధిక్యంతో వరుస సెట్లలో విజయాన్ని నమోదు చే సింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కీ రెడ్డి, ప్రణవ్ జె చోప్రా జోడీ 15-21, 19-21 తేడాతో జూ చెన్, మా జిన్ జోడీ చేతిలో ఓటమిపాలైంది.