క్రీడాభూమి

నైట్ రైడర్స్ అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 10: గౌతం గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ అన్ని విభాగాల్లో సత్తాచాటి విజయభేరి మోగించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో ఆ జట్టు మరో 35 బంతులు మిగిలి ఉండగానే, తొమ్మిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. తొలుత డేర్‌డెవిల్స్‌ను 98 పరుగులకే కట్టడి చేసిన నైట్ రైడర్స్‌కు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ప్రత్యర్థిని అదరగొట్టింది.
పెవిలియన్‌కు క్యూ
టాస్ గెలిచిన నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన డేర్‌డెవిల్స్ 24 పరుగుల వద్ద తొలి వికెట్‌కను క్వింటన్ డి కాక్ రూపంలో కోల్పోయింది. 10 బంతుల్లో, ఒక ఫోర్, మరో సిక్సర్ సాయంతో 17 పరుగులు చేసిన అతను యూసుఫ్ పఠాన్ క్యాచ్ అందుకోగా, ఆండ్రె రసెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి శ్రేయాస్ అయ్యర్ (0)ను అతను ఎల్‌బిగా పెవిలియన్‌కు పంపాడు. మాయాంక్ అగర్వాల్ 9 పరుగులకే బ్రాడ్ హాగ్ క్యాచ్ పట్టగా రసెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్ ఒకరొకరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పరుగుల వరద పారించే సత్తా ఉన్న కరుణ్ నాయర్ (3), సంచలన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన సంజూ శాంసన్ (15), ఈసారి ఐపిఎల్‌లోనే అత్యధిక ధర పలికిన భారత ఆటగాడు పవన్ నేగీ (11), ఇటీవల ముగిసిన టి-20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్‌కు అనూహ్య విజయాన్ని సాధించిపెట్టిన కార్లొస్ బ్రాత్‌వెయిట్ (11) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక వెనుదిరిగారు. అమిత్ మిశ్రా (3), కెప్టెన్ జహీర్ ఖాన్ (4) కూడా వారినే అనుసరించడంతో డేర్‌డెవిల్స్ 17.4 ఓవర్లలో 98 పరుగులకే డేర్‌డెవిల్స్ ఆలౌటైంది. నైట్ రైడర్స్ బౌలర్లలో రసెల్ 24 పరుగులకు మూడు, బ్రాడ్ హాగ్ 19 పరుగులకు మూడు చూప్పున వికెట్లు పడగొట్టారు. జాన్ హాస్టింగ్స్, పీయూష్ చావ్లా చెరి రెండు వికెట్లు సాధించారు.
బలమైన పునాది
ఎలాంటి సమస్య లేకుండా సులభంగా గెలిచే అవకాశం ఉన్న లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తుండగా, నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్, వికెట్‌కీపర్ రాబిన్ ఉతప్ప ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. మొదటి వికెట్‌కు 69 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో క్రిస్ మోరిస్ క్యాచ్ అందుకోగా అవుటైన ఉతప్ప 33 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్ల సాయంతో 35 పరుగులు సాధించాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మనీష్ పాండేతో కలిసి గంభీర్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ 14.1 ఓవర్లలో జట్టును లక్ష్యానికి చేర్చాడు. అప్పటికి అతను 38 (41 బంతులు, 5 ఫోర్లు), పాండే 15 (12 బంతులు, 3 ఫోర్లు) నాటౌట్‌గా ఉన్నారు.

స్కోరుబోర్డు
ఢిల్లీ డేర్‌డెవిల్స్: మాయాంక్ అగర్వాల్ సి బ్రాడ్ హాగ్ బి ఆండ్రె రసెల్ 9, క్వింటన్ డి కాక్ సి యూసుఫ్ పఠాన్ బి ఆండ్రె రసెల్ 17, శ్రేయాస్ అయ్యర్ ఎల్‌బి ఆండ్రె రసెల్ 0, కరుణ్ నాయర్ సి మనీష్ పాండే బి జాన్ హాస్టింగ్స్ 3, సంజూ శాంసన్ సి రాబిన్ ఉతప్ప బి బ్రాడ్ హాగ్ 15, పవన్ నేగీ స్టెంప్డ్ రాబిన్ ఉతప్ప బి బ్రాడ్ హాగ్ 11, కార్లొస్ బ్రాత్‌వెయిట్ ఎల్‌బి పీయూష్ చావ్లా 6, క్రిస్ మోరిస్ బి పీయూష్ చావ్లా 11, నాథన్ కౌల్టర్ నైల్ నాటౌట్ 7, అమిత్ మిశ్రా సి గౌతం గంభీర్ బి జాన్ హాస్టింగ్స్ 3, జహీర్ ఖాన్ సి మనీష్ పాండే బి జాన్ హాస్టింగ్స్ 4, ఎక్‌స్ట్రాలు 12, మొత్తం (17.4 ఓవర్లలో) 98 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-24, 2-25, 3-31, 4-35, 5-55, 6-67, 7-84, 8-84, 9-92, 10-98.
బౌలింగ్: ఆండ్రె రసెల్ 3-0-24-3, ఉమేష్ యాదవ్ 3-0-21-0, జాన్ హాస్టింగ్స్ 2.4-1-6-2, కొలిన్ మున్రో 1-0-7-0, బ్రాడ్ హాగ్ 4-1-19-3, పీయూష్ చావ్లా 4-0-21-2.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్: గౌతం గంభీర్ నాటౌట్ 38, రాబిన్ ఉతప్ప సి క్రిస్ మోరిస్ బి అమిత్ మిశ్రా 35, మనీష్ పాండే నాటౌట్ 15, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (14.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 99.
వికెట్ల పతనం: 1-69.
బౌలింగ్: నాథన్ కౌల్టర్ నైల్ 4-0-32-0, జహీర్ ఖాన్ 2.1-0-24-0, క్రిస్ మోరిస్ 4-0-21-0, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 2-0-9-0, అమిత్ మిశ్రా 2-0-11-1.

* బ్రాడ్ హాగ్ ఐపిఎల్‌లో తన రెండో ఉత్తమ బౌలింగ్ విశే్లషణను నమోదు చేశాడు. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌పై 29 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టిన అతను ఈ మ్యాచ్‌లో 19 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు.
* కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌ల్లో అత్యల్ప స్కోరును ఆదివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ నమోదు చేసింది. ఈ జట్టు 100 లేదా అంతకంటే తక్కువ పరుగులకే ఆలౌట్ కావడం ఇది ఏడోసారి. ఎక్కువ సార్లు ఈ విధంగా తక్కువ స్కోరుకే కుప్పకూలిన జట్టుగా డేర్‌డెవిల్స్ జట్టు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. నాలుగు పర్యాయాలు ఈ విధంగా వందకులోపే ఆలౌటైంది.
* గత మూడు సీజన్లలో డేర్‌డెవిల్స్ జట్టు 42 మ్యాచ్‌లు ఆడి, కేవలం పది విజయాలను నమోదు చేసింది. 32 పరాజగాలను ఎదుర్కొంది. గత ఏడాది 13 మ్యాచ్‌లు ఆడి, ఐదింటిని గెల్చుకుంది. ఎనిమిది మ్యాచ్‌లను చేజార్చుకుంది. తాజా సీజన్‌ను ఓటమితో మొదలుపెట్టింది.
* జాన్ హాస్టింగ్స్ కేవలం ఆరు పరుగులకు రెండు వికెట్లు కూల్చడం విశేషం.

చిత్రం... ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను దెబ్బతీసిన బ్రాడ్ హాగ్ (3/19)