క్రీడాభూమి

చివరి ఫైట్‌లో పాక్వియావో గెలువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ వెగాస్, ఏప్రిల్ 10: ఫిలిప్పీన్స్ బాక్సింగ్ వీరుడు మానీ పాక్వియావో తన చివరి ఫైట్‌లో గెలిచాడు. ప్రత్యర్థి టిమ్ బ్రాడ్లీపై విజయంతో ప్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 21 సంవత్సరాల కెరీర్ ఈ ఫైట్‌తో ముగిసిందని అతను ప్రకటించాడు. ఎంజిఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో జరిగిన ఈ ఫైట్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుందన్న అభిమానుల అంచనాలను నిజం చేస్తూ ఇద్దరు బాక్సర్లు చక్కటి ప్రతిభ కనబరిచారు. పాక్వియానో పంచ్‌లను తట్టుకోలేకపోయిన బ్రాడ్లీ రెండు పర్యాయాలు కింద పడ్డాడు. అయితే, వెంటనే తేరుకొని ఫైట్‌ను కొనసాగించాడు. నాకౌట్ ద్వారా పాక్వియావో గెలుస్తాడనుకున్న అభిమానులు నిరాశపడినప్పటికీ, 116-110 పాయింట్ల తేడాతో అతను గెలవడంతో ఊరట చెందారు. వెల్టర్‌వెయిట్ విభాగంలో పోటీపడిన 37 ఏళ్ల పాక్వియావోకు ఇది కెరీర్‌లో 66వ ఫైట్. 58వ విజయం. వీటిలో 38 విజయాలు నాకౌట్ ద్వారా సాధించినవి కావడం విశేషం. ఆరు ఫైట్స్‌లో ఓటమిపాలైన పాక్వియావో చేసిన ఫైట్స్‌లో రెండు డ్రాగా ముగిశాయి.