క్రీడాభూమి

పంజాబ్‌కు తొలి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, ఏప్రిల్ 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కొత్తగా రంగ ప్రవేశం చేసిన గుజరాత్ లయన్స్‌తో సోమవారం జరిగే తొలి పరీక్షకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సిద్ధమవుతున్నది. గత ఏడాది దారుణంగా విఫలమైన పంజాబ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. వేధిస్తున్న పాత జ్ఞాపకాల నుంచి బయటపడి, తొలి మ్యాచ్‌లో గెలవడం ద్వారా శుభారంభం చేయాలని పంజాబ్ భావిస్తున్నది. ఈసారి వేలంలో పంజాబ్ చెప్పుకోదగ్గ ఆటగాళ్లను తీసుకోలేదు. భారీ మార్పులను కూడా చేయలేదు. గత ఏడాది కెప్టెన్‌గా వ్యవహరించిన జార్జి బెయిలీని వేలం కోసం రిలీజ్ చేసింది. అతని స్థానంలో నాయకత్వ బాధ్యతలను దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్‌కు అప్పగించింది. కాగా ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వీరేందర్ సెవాగ్ క్రికెట్‌కు గుబై చెప్పి, ఈ సీజన్‌లో మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. మొత్తం మీద ఈ జట్టులో చెప్పుకోదగ్గ స్టార్లు లేరు. కెప్టెన్ మిల్లర్‌తోపాటు ఆల్‌రౌండర్లు ఫర్హాన్ బెహర్డియన్, మార్కస్ స్టోయినిస్, ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ, ఎడమచేతి వాటం స్పిన్నర్ స్వాప్నిల్ సింగ్ కొంత వరకు జట్టు బలాన్ని పెంచుతున్నారు. గ్లేన్ మాక్స్‌వెల్, మురళీ విజయ్, గుర్‌కీతర్ సింగ్ మాన్ నిలకడలేని ఆటతో సమస్యలు సృష్టిస్తున్నారు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహాకు టెస్టు క్రికెటర్ అన్న ముద్ర ఉంది పొట్టి ఫార్మెట్‌లో అతను అతర్ధతంగా రాణించిన సందర్భాలు లేవు. మొత్తం మీద నిలకడ లేమి వేధిస్తున్న నేపథ్యంలో, పంజాబ్ జట్టు సోమవారం నాటి తొలి పరీక్షకు సిద్ధమవుతున్నది.
గుజరాత్‌లో సమర్థులు..
ఐపిఎల్‌లోకి మొదటిసారి అడగుపెట్టిన గుజరాత్ లయన్స్‌లో సమర్థులైన ఆటగాళ్లు చాలా మందే కనిపిస్తున్నారు. కెప్టెన్ సురేష్ రైనా, హార్డ్ హిట్టర్లు ఆరోన్ ఫించ్, బ్రెండన్ మెక్‌కలమ్, దినేష్ కార్తీక్ తదితరులు గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తున్నారు. ఆల్‌రౌండర్లుగా డ్వెయిన్ బ్రేవో, రవీంద్ర జడేజా, ప్రవీణ్ తంబే సేవలు అందిస్తారు. బౌలింగ్ విభాగంలో జేమ్స్ ఫాల్క్‌నెర్, డేల్ స్టెయిన్, ధవళ్ కులకర్ణి తదితరులు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐపిఎల్‌కు గుజరాత్ జట్టు కొత్తగానీ, అందులోని ఆటగాళ్లు కాదు. పంజాబ్ ఎలెవెన్‌ను అగ్నిపరీక్ష పెట్టేందుకు వీరింతా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద పరాజయాల బాట నుంచి బయటపడాలని పంజాబ్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ మాదిరిగానే ఐపిఎల్ మొదటి మ్యాచ్‌లోనే గెలిచి, శుభారంభం చేయాలని గుజరాత్ పోటీపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పోరు ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలున్నాయి.

సోమవారం రాత్రి 8 గంటలకు
మ్యాచ్ ప్రారంభం.