క్రీడాభూమి

పాకిస్తాన్ టి-20 క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ సర్ఫ్‌రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఏప్రిల్ 5: పాకిస్తాన్ టి-20 జట్టుకు వికెట్‌కీపర్/ బ్యాట్స్‌మన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ నియమితుడయ్యాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాక్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. దీనితో కెప్టెన్ షహీద్ అఫ్రిదీపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. జట్టు కోచ్‌గా వ్యవహరించిన వకార్ యూనిస్ కూడా తన నివేదికలో అఫ్రిదీపై విమర్శలు గుప్పించాడు. అతను ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. మొత్తం మీద తనపై వ్యతిరేక రోజురోజుకూ పెరుతుతన్నదని గ్రహించిన అఫ్రిదీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. అయితే, తాను టి-20 ఫార్మెట్‌లో ఆటగాడిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. టి-20 వరల్డ్ కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక అందరినీ నిరాశ పరిచామని, తమను క్షమించాలని అఫ్రిదీ అభిమానులను కోరాడు. భారత్‌లో పాక్ పోరు ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా జట్లుజట్లుగా చీలిపోయారు. వేరువేరుగా స్వదేశానికి వెళ్లారు. అఫ్రిదీ సహా ఎక్కువ మంది ఆటగాళ్లు దుబాయ్‌లోనే మకాం వేశారు. స్వదేశానికి వెళితే, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న భయం వారిని వెంటాడుతున్నది. కాగా, కొంత మంది ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పరాజయాలు తప్పలేదని వకార్ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, వకార్ చాలా ఆలస్యంగా మేల్కొన్నాడని, క్షమాపణతో పరాజయాల బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడని షోయబ్ అక్తర్, రమీజ్ రాజా వంటి పలువురు మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తారు.
కాగా, అఫ్రిదీ రాజీనామాతో హడావుడిగా సమావేశమైన పిసిబి కొత్త కెప్టెన్‌గా సర్ఫ్‌రాజ్‌ను నియమించింది. తాను సర్ఫ్‌రాజ్‌తో మాట్లాడానని, అతనికి సమాచారం అందించానని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ చెప్పాడు. టి-20, వనే్డ జట్లకు సర్ఫ్‌రాజ్ ఇప్పటి వరకూ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడని చెప్పాడు. అనుభవం ఉంది కాబట్టే అతనికి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పామని తెలిపాడు. 28 ఏళ్ల సర్ఫ్‌రాజ్ కెరీర్‌లో అప్పటి వరకూ 21 టెస్టులు ఆడి 1,296 పరుగులు చేశాడు. 58 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 1,077 పరుగులు సాధించాడు. టి-20 ఫార్మెట్‌లో 21 మ్యాచ్‌లు ఆడి, 291 పరుగులు చేశాడు.
వకార్ రాజీనామా..
సెలక్షన్ కమిటీపై వేటు
పాక్ జట్టు వైఫల్యాల నేపథ్యంలో కోచ్ వకార్ యూనిస్ తన పదవికి రాజీనామా చేశాడు. సెలక్షన్ కమిటీపై వేటు పడింది. హరూన్ రషీద్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న సెలక్షన్ కమిటీని రద్దు చేశామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చిందని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపాడు. త్వరలోనే కొత్త జాతీయ సెలక్షన్ కమిటీని ప్రకటిస్తామన్నాడు. జట్టు వైఫల్యాలపై నిజనిర్ధారణ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించినట్టు షహర్యాన్ తెలిపాడు. దానిని పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని అన్నాడు.

ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో రజత పతకాన్ని సాధించి, ఈ ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన బాక్సర్ శివ థాపా. అస్సాం అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం మంగళవారం అతనిని సంప్రదాయ రీతిలో సన్మానించింది.