క్రీడాభూమి

ఇంగ్లాండ్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 3: టి-20 ప్రపంచ కప్ ఫైనల్ లో ఇంగ్లాండ్‌కు వెస్టిండీస్ షాకిచ్చింది. చివరి వర కూ గెలిచే అవకాశం ఉన్న ఇంగ్లాండ్ నాలుగు వికె ట్ల తేడాతో ఓటమిపాలుకాగా, వెస్టిండీస్ రెండోసారి టి-20 ఫార్మెట్‌లో విశ్వవిజేతగా అవతరించింది. ఇంగ్లాండ్‌ను ఓడించేందుకు 156 పరుగులు చేయా ల్సిన విండీస్ రెండు బంతులు మిగిలి ఉండగానే ల క్ష్యాన్ని చేరింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ జాసన్ రాయ్ (0) వికెట్‌ను కోల్పోయింది. సామ్యూల్ బద్రీ బౌలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలెక్స్ హాలెస్ ఒక పరుగుకే ఆండ్రె రసెల్ బౌలింగ్‌లో బద్రీకి చిక్కి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బద్రీ బౌలింగ్‌లో క్రిస్ గేల్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను ఆదుకునే బాధ్యతను జో రూట్‌తో కలిసి స్వీకరించిన జొస్ బట్లర్ 22 బంతుల్లో 36 పరుగులు సాధించి, కార్లొస్ బ్రాత్‌వెయిట్ బౌలింగ్‌లో డ్వెయిన్ బ్రేవోకు దొరికిపోయాడు. బెన్ స్టోక్స్ (13), మోయిన్ అలీ (0) ఒకే ఓవర్‌లో అవుట్‌కాగా, క్రీజ్‌లో నిలదొక్కుకొని, 36 బంతుల్లో, ఏడు ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించిన జో రూట్ 111 పరుగుల స్కోరువద్ద బ్రాత్‌వెయిట్ బౌలింగ్‌లో సులేమాన్ బెన్ చక్కటి క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. డేవిడ్ విల్లే (14 బంతుల్లోనే 21 పరుగులు సాధించగా, లియామ్ ప్లంకెట్ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 155 పరుగులు సాధించగా, అప్పటికి క్రిస్ జోర్డాన్ 12, అదిల్ రషీద్ 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. విండీస్ బౌలర్లలో కార్లొస్ బ్రాత్‌వెయిట్, డ్వెయిన్ బ్రేవో చెరి మూడు వికెట్లు కూల్చారు.
సంచలన విజయాలను సాధిస్తూ అద్భుత ఫామ్ ను కొనసాగిస్తున్న విండీస్‌కు 156 పరుగుల లక్ష్యా న్ని ఛేదించడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్త మైంది. అదే ధీమాతో విండీస్ ఓపెనర్లు జాన్సన్ చా ర్లెస్, క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయతే, కేవలం ఒక పరుగు స్కోరు వద్ద విండీస్ మొదటి వికెట్‌ను చార్లెస్ రూపంలో కోల్పోయంది. అతను ఒక పరుగు చేసి జో రూట్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న క్రిస్ గేల్ మెరుపుల కోసం స్టేడియానికి పరుగులుపెట్టిన అభిమానుల కు నిరాశే మిగిలింది. అతను ఒక ఫోర్ కొట్టి, జో రూట్ బౌలింగ్‌లో, స్టోక్స్‌కే క్యాచ్ అందించి వెనుది రిగాడు. ఫలితంగా ఐదు పరుగుల స్కోరువద్ద విం డీస్ రెండో వికెట్ కోల్పోయంది. మరో ఆరు పరు గుల అనంతరం లెండల్ సిమన్స్ కూడా అవుట్ కా వడంతో అభిమానులు నీరసపడ్డారు. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా దొరికిపోయన సిమ న్స్ పరుగుల ఖాతాను తెరవకుండానే ఎల్‌బిగా అ వుటయ్యాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్య త మార్లొన్ సామ్యూల్స్, డ్వెయన్ బ్రేవోపై పడింది. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడు తూ స్కోరును యాభై పరుగుల మైలురాయని దా టించారు. క్రమంగా బలపడుతున్న ఈ భాగస్వా మ్యాన్ని అదిల్ రషీద్ ఛేదించాడు. సామ్యూల్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 11.3 ఓవర్లలో 75 పరుగు ల కీలక భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత రషీ ద్ బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ పట్టడంతో డ్వెయన్ బ్రేవో వెనుదిరిగాడు. అతను 27 బంతుల్లో 25 పరు గులు చేశాడు. హార్డ్ హిట్టర్ అండ్రె రసెల్ ఒక పరు గు చేసి డేవిడ్ విల్లే బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో 104 పరుగుల వద్ద విండీస్ ఐదో వికెట్ ను చేజార్చుకుంది. కెప్టెన్ డారెన్ సమీ రెండు పరు గులు చేసి డేవిడ్ విల్లే బౌలింగ్‌లో అలెక్స్ హాలెస్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. అత్యంత కీ లక సమయంలో, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కూ లడంతో విండీస్ కష్టాల్లో పడింది. అయతే, అప్పటి కే నిలదొక్కుకున్న సామ్యూల్స్‌కు కార్లొస్ బ్రాత్‌వె యట్ అండగా నిలిచాడు. చివరి రెండు ఓవర్లలో వి జయానికి 27 పరుగులు అవసరంకాగా, క్రిస్ జోర్డా న్ వేసిన 19వ ఓవర్‌లో విండీస్‌కు ఎనిమిది పరుగు లు లభించాయ.
చివరి ఓవర్‌లో 19 పరుగుల దూరంలో నిలిచిన జట్టుకు బ్రాత్‌వెయట్ కొత్త ఊపిరి పోశాడు. బెన్ స్టోక్స్ వేసిన చివరి ఓవర్ మొదటి నాలుగు బంతులను సిక్సర్లుగా మార్చి విండీస్‌కు విజ యాన్ని అందించాడు. 19.4 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లకు 161 పరుగులు సాధించగా, సామ్యూల్స్ 85 (66 బంతులు, 9 ఫోర్లు, రెండు సిక్సర్లు), బ్రాత్ వెయట్ 34 (పది బంతులు, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ బి సామ్యూల్ బద్రీ 0, అలెక్స్ హాలెస్ సి సామ్యూల్ బద్రీ బి ఆండ్రె రసెల్ 1, జో రూట్ సి సులేమాన్ బెన్ బి కార్లొస్ బ్రాత్‌వెయిట్ 54, ఇయాన్ మోర్గాన్ సి క్రిస్ గేల్ బి సామ్యూల్ బద్రీ 5, జొస్ బట్లర్ సి డ్వెయిన్ బ్రేవో బి కార్లొస్ బ్రాత్‌వెయిట్ 36, బెన్ స్టోక్స్ సి లెండల్ సిమన్స్ బి డ్వెయిన్ బ్రేవో 13, మోయిన్ అలీ సి రాందీన్ బి డ్వెయిన్ బ్రేవో 0, క్రిస్ జోర్డాన్ 12 నాటౌట్, డేవిడ్ విల్లే సి జాన్సన్ చార్లెస్ బి కార్లొస్ బ్రాత్‌వెయిట్ 21, లియామ్ ప్లంకెట్ సి సామ్యూల్ బద్రీ బి డ్వెయిన్ బ్రేవో 4, అదిల్ రషీద్ 4 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1-0, 2-8, 3-23, 4-84, 5-110, 6-110, 7-111, 8-136, 9-142.
బౌలింగ్: సామ్యూల్ బద్రీ 4-1-16-2, ఆండ్రె రసెల్ 4-0-21-1, సులేమాన్ బెన్ 3-0-40-0, డ్వెయిన్ బ్రేవో 4-0-37-3, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 4-0-23-3, డారెన్ సమీ 1-0-14-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: జాన్సన్ చార్లెస్ సి బెన్ స్టోక్స్ బి జో రూట్ 1, క్రిస్ గేల్ సి బెన్ స్టోక్స్ బి జో రూట్ 4, మార్లొన్ సామ్యూల్స్ 85 నాటౌట్, లెండల్ సిమన్స్ ఎల్‌బి డేవిడ్ విల్లే 0, డ్వెయన్ బ్రేవో సి జో రూట్ బి అదిల్ రషీద్ 25, ఆండ్రె రసెల్ సి బెన్ స్టోక్స్ బి డేవిడ్ విల్లే 1, డారెన్ సమీ సి అలెక్స్ హాలెస్ బి డేవిడ్ విల్లే 2, కార్లొస్ బ్రాత్‌వెయట్ 34 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (19.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి) 161.
వికెట్ల పతనం: 1-1, 2-5, 3-11, 4-86, 5-104, 6-107.
బౌలింగ్: డేవిడ్ విల్లే 4-0-20-3, జో రూట్ 1-0-9-2, క్రిస్ జోర్డాన్ 4-0-36-0, లియామ్ ప్లంకెట్ 4-0-29-0, అదిల్ రషీద్ 4-0-23-1, బెన్ స్టోక్స్ 2.4-0-41-0.

రూట్ రికార్డు
* ఇంగ్లాండ్ తరఫున జో రూట్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక టి-20 వరల్డ్ కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని అధిరోహించాడు. తాజా సిరీస్‌లో అతను 6 ఇన్నింగ్స్‌లో 249 పరుగులు సాధించాడు. కెవిన్ పీటర్సన్ ఆరు ఇన్నింగ్స్‌లో 248, క్రెగ్ కీస్వెటర్ 7 ఇన్నింగ్స్‌లో 222 చొప్పున పరుగులతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించారు. ల్యూక్ రైట్ 5 ఇన్నింగ్స్‌లో 193, జొస్ బట్లర్ 6 ఇన్నింగ్స్‌లో 191 చొప్పున పరుగులు సాధించారు.
ఇంగ్లాండ్ మొదటి వికెట్‌కు కేవలం ఒక పరుగును మాత్రమే సాధించగలిగింది. టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఆ జట్టు ఈ విధంగా ఒక పరుగుకే తొలి వికెట్‌ను చేజార్చుకోవడం ఇది రెండోసారి. 2009లో మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే విధంగా ఒక పరుగుకే ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టపోయింది.