క్రీడాభూమి

విజయంపై విండీస్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, మార్చి 26: మూడు వరుస విజయాలతో ఇప్పటికే టి-20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన వెస్టిండీస్, వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్న అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఆదివారం ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ జరగనుంది. అయితే, కనీసం ఒక మ్యాచ్‌ని గెల్చుకోవాలన్న పట్టుదలతో అఫ్గాన్ ఆడనుంది. విండీస్ కూడా విజయంపై కనే్నసింది. గ్రూప్-2లో న్యూజిలాండ్ మాదిరిగానే గ్రూప్-1 నుంచి ఆడిన నాలుగు మ్యాచ్‌లను గెల్చుకున్న జట్టుగా నిలవాలన్న లక్ష్యంతో పోరాటానికి సిద్ధమవుతున్నది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో విండీస్ సూపర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఏ విధంగా చెలరేగుతాడో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తున్నది.