క్రీడాభూమి

గ్రూప్ దశలో కివీస్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 26: టి-20 వరల్డ్ కప్ పోటీల్లో ‘అండర్ డాగ్’ ముద్ర వేయించుకొని బరిలోకి దిగిన న్యూజిలాండ్ గ్రూప్ దశలో శనివారం బంగ్లాదేశ్‌ను 75 పరుగుల తేడాతో చిత్తుచేసింది. లీగ్ స్థాయిలో నాలుగు మ్యాచ్‌లను గెల్చుకొని క్లీన్‌స్వీప్ చేసింది. 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చేసిన ప్రయత్నంలో విఫలమైన బంగ్లాదేశ్ టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఎనిమిదో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ముస్త్ఫాజుర్ రహ్మాన్ 22 పరుగులకే ఐదు వికెట్లు కూల్చి కివీస్‌ను దెబ్బతీసినప్పటికీ, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో బంగ్లాదేశ్ విఫలమైంది. కాగా, మూడు వరుస విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని, 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు సాధించింది. టి-20 ఇంటర్నేషనల్స్‌లో అరంగేట్రం చేసిన హెన్రీ నికోల్స్ కేవలం 7 పరుగులకే ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌కాగా, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (42), కొలిన్ మున్రో (35), రాస్ టేలర్ (28) జట్టును ఆదుకున్నారు. కొరీ ఆండర్సన్ (0), గ్రాంట్ ఇలియట్ (9), మిచెల్ సాంట్నర్ (3), నాథన్ మెక్‌కలమ్ (0) పరుగుల వేటలో తడబడి పెవిలియన్‌కు క్యూ కట్టారు. 20 ఓవర్లు ముగిసే సమయానికి ల్యూక్ రోన్చీ (9), మిచెల్ మెక్‌క్లీన్‌గన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్ ముస్త్ఫాజుర్ రహ్మాన్ నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. టి-20 ఫార్మెట్‌లో అతను ఐదు లేదా అంతకు మించి వికెట్లు సాధించడం ఇది మూడోసారి. అల్ అమీన్ హొస్సేన్ 27 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు.
ఇప్పటికే పాకిస్తాన్‌తో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్‌కు మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ప్రభావం లేకపోయినా, విజయంతో ఇంటిదారి పట్టాలన్న ఆశతో 146 పరుగుల లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో చేసింది. కానీ, నాలుగు పరుగుల వద్ద ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (3) వికెట్ కూలగా, ఆతర్వాత బంగ్లాదేశ్ కోలుకోలేకపోయింది. మహమ్మద్ మిథున్ (11), సబ్బీర్ రహ్మాన్ (12), షువగత హొమ్ (16) తప్ప ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేదు.