క్రీడాభూమి

పాక్ జట్టుపై విమర్శల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై స్థానిక మీడియా విరుచుకుపడింది. పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. సరైన వ్యూహం లేకనే ఓడిందంటూ, దీనికి కోచ్ వకార్ యూనిస్, కెప్టెన్ షహీద్ అఫ్రిదీ బాధ్యత వహించాలని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక విమర్శించింది. నలుగురు పేసర్లను జట్టులోకి తీసుకొని, ఎడమచేతి వాటం స్పిన్నర్ ఇమాద్ వసీంకు తుది జట్టులో అవకాశం కల్పించకపోవడం జట్టు మేనేజ్‌మెంట్ చేసిన పెద్దతప్పిదమని పేర్కొంది. వర్షం కురిసినందువల్ల, వాతావరణం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించదని తెలిసినప్పటికీ, పిచ్ తీరును సద్వినియోగం చేసుకోవడానికి స్పెషలిస్టు స్పిన్నర్ ఇమాద్‌ను ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. పురుషుల జట్టు కంటే పాకిస్తాన్ మహిళల జట్టే మేలని ‘ది నేషన్’ పత్రిక వ్యాఖ్యానించిది. భారత బ్యాట్స్‌మెన్‌ను, ప్రత్యేకించి కోహ్లీని కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారని ‘ది డైలీ టైమ్స్’ విమర్శించింది. జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శనను ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించింది. మాజీ కెప్టెన్లు మిస్బా ఉల్ హక్, ఇమ్రాన్ ఖాన్, ఇంజమాముల్ హక్ తదితరులు కూడా భారత్ చేతిలో పాకిస్తాన్ పరాజయం పట్ల విచారం వ్యక్తం చేశారు. సరైన వ్యూహ రచన చేయడంలో పాక్ జట్టు మేనేజ్‌మెంట్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అందకే ఓడిందని అన్నారు.
అతనొక్కడే..
విరాట్ కోహ్లీ ఒక్కడే మ్యచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చివేశాడని పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ వ్యాఖ్యానించాడు. ఇరు జట్లు అన్ని విభాగాల్లోనూ సమవుజ్జీగానే ఉన్నాయని, అయితే, కోహ్లీ ఒక్కడి వల్లే మ్యాచ్ భారత్‌వైపు మొగ్గుచూపిందని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు. వాతావరణాన్ని ముందుగా ఊహించడంగానీ, మార్చడంగానీ మన చేతుల్లో ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ప్రతికూల వాతావరణంలో పరుగులు చేయడానికి ఇరు జట్లలోనూ బ్యాట్స్‌మెన్ చాలా కష్టపడ్డారని అన్నాడు. అయితే, కోహ్లీ ఒక్కడే ఎంతో సంయమనంతో ఆడాడని తెలిపాడు. ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌ల్లో విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఒక్క పరాజయానికే కుంగిపోవాల్సిన అవ సరం లేదని వ్యాఖ్యానించాడు.