క్రీడాభూమి
సానియా అకాడమీలో దిగ్గజాల పోరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, నవంబర్ 20: మిక్స్‌డ్ డబుల్స్ స్టార్ జట్లయిన లియాండర్ పేస్-మార్టినా నవ్రతిలోవా, మహేష్ భూపతి-సానియా మీర్జా మధ్య మూడు మ్యాచ్‌ల ఎగ్జిబిషన్ టోర్నమెంట్‌లో రెండవ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఎస్‌ఎంటిఎ (సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ)లో వచ్చే గురువారం జరుగుతుంది. గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు ఇప్పటివరకూ రెండేసి టైటిళ్లు సాధించాయి. లియాండర్ పేస్-మార్టినా నవ్రతిలోవా జోడీ 2003లో ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు అదే ఏడాది వింబుల్డన్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకోగా, మహేష్ భూపతి-సానియా మీర్జా 2009లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను, 2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఎస్‌ఎంటిఎ ఎంతో గర్విస్తోందని టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. భారత్‌లో టెన్నిస్ అభివృద్ధికి ఈ ఈవెంట్ మరో ముందడుగని, ఎంతో అద్భుతమైన ఈ క్రీడలో సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్న వర్థమాన ఆటగాళ్లకు ఇది తప్పకుండా స్ఫూరినిస్తుందని సానియా మీర్జా పేర్కొంది. ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 25వ తేదీన కోల్‌కతాలోనూ, మూడవ మ్యాచ్ ఈ నెల 27వ తేదీన జరుగుతాయి. మహిళల డబుల్స్‌లో ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలసి ఈ ఏడాది వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లతో పాటు సింగపూర్‌లో జరిగిన సంవత్సరాంతపు డబ్ల్యుటిఎ ఫైనల్స్‌లోనూ విజయభేరి మోగించిన సానియా మీర్జా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంది.