క్రీడాభూమి

భారత్‌కు ఫిట్నెస్ సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను ఢీ కొంటున్న భారత్‌ను ఫిట్నెస్ సమస్య వేధిస్తున్నది. అన్ని విధాలా ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ పూర్తి ఫిట్నెస్‌తో లేకపోవడంతో సమస్యలు తప్పకపోవచ్చు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టి-20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా ఫేవరిట్ ముద్రతోనే బరిలోకి దిగుతున్నా, బ్యాటింగ్ ఆర్డర్ కూర్పులో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. ధావన్ ఎడమకాలి మడమ నొప్పితో బాధపడుతున్నట్టు టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అందుకే అతను పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్గొనలేదని తెలిపింది. కానీ, మీర్పూర్‌లో బంతి బౌన్స్ అవుతూ, హఠాత్తుగా దిశను మార్చుకుంటుందని, అలాంటి పిచ్‌లపై ధావన్ రాణించలేదని టీం మేనేజ్‌మెంట్ అభిప్రాయమన్న వాదన కూడా వినిపిస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే అతనిని పక్కకు తప్పించారని కొందరు అంటున్నారు. కాగా, రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది. ముందు జాగ్రత్తగా ఎక్స్‌రే తీయించారు. ఎముక ఫ్రాక్చర్ కాలేదని వైద్యులు స్పష్టం చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. అయితే, మంగళవారం నాటి మ్యాచ్‌లో అతను ఆడతాడా అన్నదే అనుమానం.
ఓపెనర్లుగా రహానే, పార్థీవ్
ధావన్, రోహిత్ ఫిట్నెస్ కారణంగా మంగళవారం నాటి మ్యాచ్‌కి దూరమైతే, వారి స్థానంలో ఆజింక్య రహానే, పార్థీవ్ పటేల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. కెప్టెన్ ధోనీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు కాబట్టి, అతని స్థానంలో పార్థీవ్‌కు కీపింగ్ బాధ్యతలను అప్పచెప్పడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి టి-20 టోర్నీల్లో తాను ప్రతినిథ్యం వహించిన జట్ల ఇన్నింగ్స్‌ను పార్థీవ్ ప్రారంభిస్తున్నాడు. పిచ్ తీరులో మార్పులను బట్టి ఓపెనర్లను ఖరారు చేస్తారు. ఒకవేళ పిచ్ మరీ బౌన్సిగా లేకపోతే, ధావన్‌ను బరిలోకి దించవచ్చు. కొత్త ఓపెనింగ్ జంటతో ప్రయోగం చేయడం కంటే ఒక రెగ్యులర్ ఓపెనర్ ఉంటేనే మెరుగన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. మొత్తం మీద గాయాల కారణంగా తుది జట్టు కూర్పు, ప్రత్యేకించి బ్యాటింగ్ ఆర్డర్‌ను నిర్దేశించడం కష్టంగా మారింది. అయితే, రెగ్యులర్ టాప్ బ్యాట్స్‌మెన్ ఉన్నాలేకు న్నా, లంకపై భారత్‌కే విజయావకాశాలున్నాయి.
నెహ్రాకు విశ్రాంతి?
వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు మంగళవారం నాటి మ్యాచ్ నుంచి విశ్రాంతినిస్తారన్న వార్త వినిపిస్తున్నది. ఒక నెల వ్యవధిలోనే అతను ఎనిమిది టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టి-20 వరల్డ్ కప్ సమీపిస్తున్న కారణంగా అతనిని ఒకటిరెండు మ్యాచ్‌ల నుంచి తప్పించాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించవచ్చు. ఒకవేళ నెహ్రా లేకపోతే, భువనేశ్వర్ కుమార్‌కు తుది జట్టులో స్థానం దక్కుతుంది. యువ ఫాస్ట్ బౌలర్లు హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పటికే తమ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ప్రత్యేకించి పాండ్య తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. కాబట్టి వీరిద్దరికీ తుది జట్టులో స్థానం లభించడం ఖాయం. స్పిన్ విభాగానికి వస్తే, ప్రయోగాలు చేయాలని జట్టు డైరెక్టర్ రవి శాస్ర్తీ, కెప్టెన్ ధోనీ అనుకోపోతే, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జట్టులో ఉంటారు. హర్భజన్ సింగ్, పవన్ నేగీలకు చోటు దక్కకపోవచ్చు.
లంకకు కోలుకునే అవకాశం!
బంగ్లాదేశ్ చేతిలో పరాజయాన్ని చవిచూసిన శ్రీలంక కోలుకోవడానికి మంగళవారం నాటి మ్యాచ్‌లో అవకాశం లభించనుంది. బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో విజయం సాధించడంతో కంగుతిన్న లంక ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా లంక 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. ఆటగాళ్లలో నిలకడ లేకపోవడం వల్లే లంకకు ఓటమి తప్పలేదు. ఆ మ్యాచ్‌లో దొర్లిన పొరపాట్లను సరిదిద్దుకొని భారత్‌ను ఓడించడం ద్వారా మళ్లీ రేసులోకి రావాలని లంక ఆశిస్తున్నది. అయితే, లంకేయుల ప్రయత్నం ఫలిస్తుందా అన్నదే అనుమానం.

నెట్స్‌కు హాజరైనా
లంకతో మ్యాచ్‌కి అనుమానమే..
భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ