క్రీడాభూమి

హిట్టింగ్‌కు పనికిరాని పిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: షేర్ ఎ బంగ్లా స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం అనుకూలంగా లేదని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విమర్శించాడు. హిట్టింగ్‌కు ఏమాత్రం పనికిరాదని విమర్శించాడు. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఈ పిచ్‌పై లభించలేదని అన్నాడు. శనివారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం మీద 33 ఓవర్లు మాత్రమే బౌల్‌కాగా, 15 వికెట్లు కూలిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. ఈ పిచ్ టి-20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఆడే స్థాయిలో ఉందా లేదా అన్న ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని అన్నాడు. అయితే, బంతి విపరీతంగా బౌన్స్‌కావడం, వేగంగా దిశను మార్చుకోవడం వంటి అంశాలు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందికి గురి చేశాయని ధోనీ తెలిపాడు. సహజంగా టి-20 మ్యాచ్‌లు అంటేనే సిక్స్‌లు, ఫోర్ల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారని అన్నాడు. కానీ, లో స్కోరింగ్ మ్యాచ్‌లను చూడాల్సి రావడంతో వారు నిరాశ చెంది ఉంటారని చెప్పాడు. ఎంతటి లో స్కోరింగ్ మ్యాచ్‌లోనైనా 130 నుంచి 135 పరుగులు, హైస్కోరింగ్ మ్యాచ్‌లో 200 నుంచి 240 పరుగులు నమోదు అవుతాయన్నాడు. కానీ స్కోర్లు వంద పరుగులు కూడా దాటకపోవడం వల్ల అభిమానుల అంచనాలు తారుమారవుతాయని తెలిపాడు.
ఇయర్ పీస్‌లతో నష్టం
ఫీల్డ్ అంపైర్లు చెవిలో వినికిడి పరికారాన్ని పెట్టుకొని, థర్డ్ అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీలతో సంభాషించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని ధోనీ స్పష్టం చేశాడు. ఇయర్ పీస్‌లు ఉండడం వల్ల బ్యాట్‌కు బంతి తగిలిందా? లేదా? అన్న విషయాన్ని గ్రహించే అవకాశం అంపైర్లుకు ఉండడం లేదన్నాడు. సాంకేతిక పరిజ్ఞానం క్రీడకు ఉపయోగపడాలేగానీ సమస్యలు సృష్టించేదిగా ఉండకూడదని పేర్కొన్నాడు. టెక్నాలజీని వాడడం తప్పుకాద ని, అయతే, వాటి వల్ల వచ్చే సమస్యలను గ్రహించి నివారించాలని ధోనీ సూచించాడు.