క్రీడాభూమి

టీమిండియాలోకి మళ్లీ వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 20: సమీప భవిష్యత్తులోనే తాను తిరిగి భారత జట్టులోకి వస్తానన్న విశ్వాసాన్ని స్పిన్నర్ హర్భజన్ సింగ్ శుక్రవారం వ్యక్తం చేసాడు. ఇటీవలి వన్‌డేలలో తాను బాగానే రాణించానని అతను చెప్తూ, మళ్లీ టెస్టు మ్యాచ్‌లలో ఆడే అవకాశం లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నానని తెలిపాడు. ఆడేటప్పుడు దూకుడుగా ఉండడం గురించి అడగ్గా, దూకుడుగా ఉండడం అనేది సవాలును ఎలా ఎదుర్కోవానే దానికి సంబంధించినదిగా ఉండాలి. ఎవరినైనా కొట్టడం, లేదా చావబాదడం కాదు. నాకు సంబంధించినంతవరకు దూకుడు అంటే బంతికి, బ్యాట్‌కు సంబంధించినదై ఉండాలి’ అని హర్భజన్ అన్నాడు. అంతేకాదు, ఎలాంటి ఉద్రేకానికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడమే ఆటగాడికి మంచిదని కూడా చెప్పాడు. బోలెడంత క్రికెట్ ఆడిన తర్వాత తాను చాలా విషయాలు నేర్చుకున్నానని.. ఎవరికైనా కావలసింది ప్రశాంతంగా ఉండడం, దూకుడు ధోరణి అవసరమేనని వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రకటన నేపథ్యంలో విలేఖరులతో మాట్లాడుతూ భజ్జీ అన్నారు. దేశవ్యాప్తంగా అయిదు అకాడమీలను నడుపుతున్న హర్భజన్ గ్రామాల్లో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికి తీయడమే తన లక్ష్యమని చెప్పాడు. తాను నడిపే ఈ క్రికెట్ అకాడమీల్లో కోచ్‌లు బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫీల్డర్లకు శిక్షణ ఇస్తారని అతను చెప్తూ, జలంధర్, ఫగ్వారా, లక్నో, కోల్‌కతాలలోని అకాడమీల్లో దాదాపు 900 మంది యువ క్రికెటర్లు శిక్షణ పొందుతున్నారని చెప్పాడు. అంతేకాదు, క్రికెట్ తనకెంతో ఇచ్చిందని, దానికి తిరిగి ఏదయినా సేవ చేయాల్సిన సమయం ఇదని చెప్పాడు.