క్రీడాభూమి

మిల్లర్‌కు కింగ్స్ ఎలెవన్ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఫిబ్రవరి 9: ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదవ ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో తలపడే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్‌ను సారథిగా నియమించినట్లు మంగళవారం ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఐపిఎల్ నాలుగో ఎడిషన్ నుంచి మిల్లర్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది తమ జట్టుకు సారథ్యం వహించే అవకాశం లభించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, తనపై విశ్వాసం ఉంచిన కింగ్స్ ఎలెవెన్ ఫ్రాంచైజ్‌కు, జట్టు యాజమాన్యానికి, ప్రమోటర్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని మిల్లర్ తెలిపాడు. ‘యువకులు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో ఈసారి పంజాబ్ జట్టు కూర్పు అద్భుతంగా ఉంది. కనుక ఈ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం కోసం నిజంగానే ఎంతో ఎదురుచూస్తున్నా’ అని మిల్లర్ అన్నాడు. కాగా, కెప్టెన్‌గా మిల్లర్ రాణించగలడని తనకు నమ్మకం ఉందని కింగ్స్ ఎలెవెన్ కోచ్ సంజయ్ బంగర్ చెప్పాడు.
‘ఆటగాడిగా మిల్లర్ ఎలా ఎదిగాడో నేను చూశా. బ్యాటింగ్‌లో చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించే మిల్లర్ తనపై ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ చాలా కూల్‌గా ఉంటాడు. కనుక జట్టు సారథిగా అతను రాణించగలడని నేను గట్టిగా విశ్వసిస్తున్నా’ అని బంగర్ పేర్కొన్నట్లు కింగ్స్ ఎలెవెన్ యాజమాన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.

మహిళల టి-20 ప్రపంచ కప్‌కు
మళ్లీ అదే జట్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆస్ట్రేలియాలో గత నెల జరిగిన ట్వంటీ-20 సిరీస్‌లో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో తలపడనుంది. మార్చి-ఏప్రిల్ మధ్య భారత్‌లో జరిగే ఈ టోర్నీలో టీమిండియాకు మరోసారి మిథాలీ రాజ్ సారథ్యం వహిస్తుంది. గత నెల ఆస్ట్రేలియాలో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌లో భారత జట్టు కంగారూలపై తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయతే ఆ తర్వాత కంగారూలతో జరిగిన మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ సిరీస్‌ను 2-1 తేడాతో భారత జట్టు చేజార్చుకుంది.
ప్రపంచ కప్ టి-20లో
తలపడే భారత జట్టు ఇదీ
మిథాలీ రాజ్ (కెప్టెన్), ఝులన్ గోస్వామి, స్మృతి మందన, వేదా కృష్ణమూర్తి, హర్మన్‌ప్రీత్ కౌర్, శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్, సుష్మా వర్మ, పూనమ్ యాదవ్, విఆర్.వనిత, అంజూ పాటిల్, ఏక్తా బిస్త్, ఎండి.తిరుష్కామినీ, దీప్తి శర్మ, నిరంజనా నాగరాజన్.