క్రీడాభూమి

భారత్‌లో మా జట్టుకు ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఫిబ్రవరి 9: భారత్‌లో వచ్చే నెల నుంచి జరిగే ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనాలా? లేదా? అనే విషయంపై ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సమావేశంలో చర్చించామని పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపాడు. పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించేందుకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాక్‌కు సంబంధించిన మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఐసిసికి ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు. పాక్ జట్టుకు భారత్‌లో అతివాదుల నుంచి ముప్పు ఉందని, కనుక భారత్‌లో పర్యటించేందుకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవచ్చని, అందుకే ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాక్‌కు సంబంధించిన మ్యాచ్‌లను దుబాయ్, షార్జా లేదా కొలంబో వంటి తటస్థ వేదికల్లో నిర్వహించాల్సిందిగా ఐసిసికి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. ప్రపంచ కప్ టి-20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనే విషయం ప్రభుత్వ అనుమతులకు లోబడే ఉంటుందని ఐసిసికి తెలియజేశామన్నారు. ‘్భరత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో డిసెంబర్‌లో టీమిండియా మాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ఈ సిరీస్‌ను కుదించడంతో పాటు దానిని శ్రీలంకకు మార్చి మేము ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ టీమిండియాకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కనుక ప్రస్తుతం టి-20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనేందుకు పాక్ జట్టు భారత్‌లో పర్యటించడంపై మా ప్రభుత్వం ఏమి చెబుతుందన్న దానికోసం ఎదురుచూస్తున్నామని ఐసిసికి స్పష్టం చేశాం’ అని షహర్యార్ ఖాన్ తెలిపాడు.