క్రీడాభూమి

ఆస్ట్రేలియా టి-20 సారథిగా స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఫిబ్రవరి 9: వచ్చే నెల నుంచి భారత్‌లో జరిగే ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఇప్పటివరకూ ఆసీస్ టి-20 జట్టుకు సారథ్యం వహించిన ఆరోన్ ఫించ్‌ను పక్కకు తప్పించి సెలెక్టర్లు మంగళవారం ఫించ్‌ను కెప్టెన్‌గా నియమించారు. అలాగే వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు బదులుగా పీటర్ నెవిల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా టి-20 జట్టుకు 2014 అక్టోబర్ నుంచి ఫించ్ సారథ్యం వహిస్తుండగా, టెస్టు, వనే్డ జట్లకు స్మిత్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే పొట్టి ఫార్మాట్ జట్టు సారథ్య బాధ్యతలను కూడా స్మిత్‌కు అప్పగించేందుకు ఇదే సరైన తరుణమని ఆస్ట్రేలియా జాతీయ సెలెక్టర్ రోడ్ మార్ష్ స్పష్టం చేశారు. ‘ఆస్ట్రేలియా ట్వంటీ-20 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఫించ్ ఇప్పటివరకూ తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించాడు. జట్టు సారథ్య అవకాశాన్ని అందిపుచ్చుకుని అతను ఎంతో ప్రయోజనం పొందాడు. కనుక ఇకముందు కూడా ఆస్ట్రేలియా జట్టులో ఫించ్ ఎంతో గౌరవప్రదమైన నాయకుడిగా కొనసాగుతాడు’ అని మార్ష్ పేర్కొన్నాడు. ఆసీస్ టి-20 జట్టు సారథిగా ఫించ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టు, వనే్డ జట్ల నాయకత్వ మార్పు జరిగిందని, మైఖేల్ క్లార్క్ రిటైరవడంతో టెస్టు, వనే్డ జట్ల సారథ్య బాధ్యతలను నిర్వర్తిస్తున్న స్మిత్‌కు టి-20 జట్టు కెప్టెన్సీని కూడా అప్పగించడం ఎంతో ముఖ్యమని, అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నామని మార్ష్ తెలిపాడు. ప్రపంచ కప్ టి-20 టోర్నమెంట్‌లోనే కాకుండా ఆ తర్వాత జరిగే ఇతర టోర్నీల్లోనూ స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహిస్తాడని మార్ష్ స్పష్టం చేశాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడని నెవిల్‌కు టి-20 ప్రపంచ కప్‌లో తలపడే 15 మంది సభ్యుల జట్టులో చోటు కల్పించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే గత కొంత కాలం నుంచి అటు వికెట్ కీపింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ మాథ్యూ వేడ్ సరిగా రాణించలేకపోతుండంతో సెలెక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించి నెవిల్‌కు చోటు కల్పించినట్లు స్పష్టమవుతోంది.
ప్రపంచ కప్ టి-20కి ఆసీస్ జట్టు ఇదీ..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిఛెల్ మార్ష్, జేమ్స్ ఫాల్క్‌నర్, జాన్ హేస్టింగ్స్, పీటర్ నెవిల్, ఆడమ్ జంపా, జోష్ హాజెల్‌వుడ్, ఆరోన్ ఫించ్, నాథన్ కౌల్టర్ నీల్, అష్టోన్ అగర్, ఆండ్రూ టై.

అన్ని ఫార్మాట్లకు సారథిగా నియమితుడైన స్టీవ్ స్మిత్