క్రీడాభూమి

చెలరేగిన సౌరెజ్, మెస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, ఫిబ్రవరి 4: స్టార్ ఆటగాళ్లు లూయిస్ సౌరెజ్, లియోనెల్ మెస్సీ చెలరేగిపోయి, హ్యాట్రిక్స్‌ను నమోదు చేయడంతో కోపా డెల్ రే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ జట్టు 7-0 తేడాతో వలెన్షియాను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ బార్సిలోనా దాడి కొనసాగింది. ప్రత్యర్థులను అడ్డుకోవడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించిన వలెన్షియా క్రీడాకారులు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. సౌరెజ్ 7, 12, 83, 88 నిమిషాల్లో గోల్స్ సాధించగా, మెస్సీ 29, 59, 74 నిమిషాల్లో గోల్స్ నమోదు చేశాడు. కాగా, రెండో సెమీ ఫైనల్‌లో సెవిల్లా, సెల్టా విగో జట్లు ఢీ కొంటాయి.

పంజాబ్‌కు యుపి షాక్
చండీగఢ్, ఫిబ్రవరి 4: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) చక్కటి ప్రతిభ కనబరుస్తున్న పంజాబ్ వారియర్స్‌కు ఉత్తర ప్ర దేశ్ విజార్డ్స్ షాకిచ్చింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో ప్రత్యర్థిని ఓడింది. ఓ విజయంతో యుపి చివరి నుంచి రెండో స్థానాన్ని దక్కించుకుంది. మ్యాచ్ 44వ నిమిషంలో ఆకాష్‌దీప్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో యుపికి రెండు గోల్స్ లభించాయ. 60వ నిమిషంలో గంజొలెజ్ పిలాట్ ద్వారా ఆ జట్టుకు మరో గోల్ దక్కింది. కాగా, ఓడిన పంజాబ్ మరో రెం డు జట్లతో సమానంగా రెండో స్థానంలో ఉంది.
రీవా సోలంకీతో నేడు
జడేజా నిశ్చితార్థం
రాజ్‌కోట్, ఫిబ్రవరి 4: మెకానికల్ ఇంజనీర్ రీవా సోలంకీతో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా నిశ్చితార్థం శుక్రవారం జరగనుంది. ఆత్మీయ కాలేజీ నుంచి ఇంజనీరింగ్ పట్టాను పొందిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలో యుపిఎస్‌సి పరీక్షలకు సిద్ధమవుతున్నది. ఆమె తండ్రి వ్యాపారస్తుడుకాగా, తల్లి ప్రఫుల్లాబా సోలంకీ రైల్వేలో ఉద్యోగిని. జడేజా స్వగృహంలోనే నిశ్చితార్థం జరుగుతుందని జడేజా సోదరి నైనా జడేజా తెలిపింది.