క్రీడాభూమి
నాలుగో టెస్టుకూ స్టెయిన్ దూరమే?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: టీమిండియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో చేజార్చుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ చివరి మ్యాచ్‌లోనూ దూరం కానున్నాడా? ఈ మ్యాచ్‌కి సంబంధించి సఫారీలు మంగళవారం నెట్ ప్రాక్టీస్ చేసినప్పుడు కనిపించిన దృశ్యాలు ఈ ప్రశ్నకు ‘అవును’ అనే సమాధానమిస్తున్నాయి. చీలమండ గాయంతో ఇబ్బందులు పడుతున్న స్టెయిన్ ఈ సిరీస్‌లో ఇంతకుముందు వరుసగా రెండు టెస్టులకు దూరంగా ఉన్న విషయం విదితమే. అయితే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మంగళవారం న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నెట్ ప్రాక్టీస్‌కు దిగినప్పుడు అందరూ ప్రధానంగా స్టెయిన్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. సహచర ఆటగాళ్లతో కలసి స్టెయిన్ మైదానంలోకి వచ్చినప్పటికీ సాధనలో పాల్గొనలేదు. కనీసం బౌలింగ్ స్పైక్స్ కూడా ధరించలేదు. సాధారణ ట్రైనింగ్ బూట్లు మాత్రమే ధరించి మైదానంలో కొద్దిసేపు అటూ ఇటూ తిరిగిన స్టెయిన్ ఆ తర్వాత దూరంగా వెళ్లి కూర్చున్నాడు. దీనిని బట్టి చూస్తే మొహాలీలో తొలి టెస్టు సందర్భంగా తగిలిన గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదన్న విషయం స్పష్టమవుతోంది. అంతేకాకుండా స్టెయిన్‌కు బదులుగా ఇంతకుముందు మూడో టెస్టులో ఆడిన మర్చంట్ డీ లాంగేతో పాటు కైల్ అబ్బాట్ దక్షిణాఫ్రికా జట్టులోని ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ సేపు నెట్స్‌లో సాధన చేయడం నాలుగో టెస్టుకు స్టెయిన్ దూరం కానున్నాడన్న విషయాన్ని మరింత బలపరుస్తోంది.