క్రీడాభూమి

ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత యుపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జనవరి 20: ప్రతిష్ఠాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను ఉత్తర ప్రదేశ్ (యుపి) జట్టు కైవసం చేసుకుంది. బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ లో ఈ జట్టు బరోడాను 38 పరుగుల తేడాతో ఓ డించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన బరోడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేయగలిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన యుపి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కో ల్పోయ 163 పరుగులు చేసింది. ప్రశాంత్ గుప్తా 49 పరుగులు సాధించగా, సురేష్ రైనా అజేయం గా 47 పరుగులు చేశాడు. బరోడా బౌలర్లలో భా ర్గవ్ భట్ 13 పరుగులకే 2 వికెట్లు పడగొట్టాడు. ఇర్ఫాన్ పఠాన్ 44 పరుగులకు ఒకటి, ఆస్ట్రేలియా లో టి-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపి కైన హార్దిక్ పాండ్య 31 పరుగులకు ఒకటి చొప్పు న వికెట్లు పడగొట్టారు. అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన బరోడా 26 పరుగుల వద్ద కేదార్ దేవధర్ (19) అ వుటయ్యాడు. మరో ఓపెనర్ మృణాల్ దేవధర్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుట్‌కావడంతో కష్టాల్లో పడిన బరోడా కోలుకోలేకపోయంది. జ ట్టును గెలిపించే సత్తావున్న హార్దిక్ పాండ్య (13), దీపక్ హుడా (15) తక్కువ స్కోర్లకే వెనుదిరగడం తో బరోడా ఆశలు నీరుగారిపోయాయ. భారీ షా ట్లతో బౌలర్లపై విరుచుకుపడే యూసుఫ్ పఠాన్ కూడా బాధ్యతాయుతంగా ఆడలేకపోయాడు. అ తను 14 పరుగులకే పెవిలియన్ చేరగా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విపరీతమైన ఒత్తిడికి గుర య్యారు. షోయబ్ తాయ్ (26 నాటౌట్) చివరి వ రకూ పోరాటాన్ని కొనసాగించినా ఫలితం లేకపో యంది. బరోడా ఆలౌట్ కాకపోయనా, రన్‌రేట్‌ను అందుకోలేక, 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 125 పరుగులు చేయగలిగింది.