క్రీడాభూమి

చిక్కుల్లో సెబాస్టియన్ కో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జనవరి 13: ఐఎఎఎఫ్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన సెబాస్టియన్ కో చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తున్నది. దాదాపు ఒకటిన్నర దశాబ్దాలపాటు ఐరోపా అథ్లెటిక్స్ సమాఖ్యకు చీఫ్‌గా వ్యవహరించిన అతనిపై నేరుగా ఫిర్యాదులుగానీ, ఆరోపణలుగానీ ఏవీ లేవు. అయితే, వాడా కమిటీ సమర్పించే రెండో నివేదికలో ఐరోపా దేశాలు, అథ్లెట్ల పేర్లు చేరితే, కో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని హయాంలోనే ఐరోపా దేశాలు డోపింగ్‌కు పాల్పడ్డాయన్న వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. రెండో నివేదికలో ఏఏ దేశాల పేర్లు ఉంటాయన్న అంశంపైనే కోకు ఊరట లభిస్తుందా లేదా అన్నది తెలుస్తుంది. ఐరోపా దేశాల్లోనేగాక, యావత్ ప్రపంచ అథ్లెటిక్స్‌పైనా తనదైన ముద్ర వేసిన కో ఈ చిక్కుల నుంచి బయటపడతాడా లేదా అన్నది వేచిచూడాలి.