క్రీడాభూమి

ఇంతకంటే మెరుగైన ఫలితాలు కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: ఈ ఏడాదికన్నా మెరుగైన ఏడాది తన కెరీర్‌లో ఉండడం చాలా కష్టమని, అయితే ఈ సీజన్‌లో సాధించిన విజయాలతో సరితూగేలా ఉండడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటోంది. 2015 సీజన్‌లో మార్టినా హింగిస్ జోడీగా సానియా డబుల్స్‌లో రెండు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెలుచుకోవడమే కాకుండా డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ జోడీ అయిన విషయం తెలిసిందే. ‘వచ్చే ఏడాది దీనికన్నా మెరుగ్గా కాకపోయినా కనీసం సరిపోయే విజయాలు సాధిస్తామని మేము ఆశిస్తున్నాం. దీనికన్నా మెరుగైన ఏడాది కలిగి ఉండడం కష్టమే. అయితే దీనికన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామేమో ఎవరికి తెలుసు. మరో గ్రాండ్‌శ్లామ్ సాధిస్తే అంతకన్నా కావలసింది ఏముంటుంది’ అని సానియా శుక్రవారం ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది.
2015లో మార్టినా హింగిస్‌తో కలిసి సానియా రెండు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు, మరో ఎనిమిది టైటిళ్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇన్ని విజయాలు తాను ఏ ఏడాదిలోను సాధించలేదని, అందుకే ఇది తనకు ప్రత్యేకమైన సంవత్సరమని సానియా చెప్పింది. ‘ఒక సంవత్సరం కాదు, నిజం చెప్పాలంటే నా మొత్తం కెరీరే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలు నిజంగానే బాగున్నాయి. ఒక ఏడాది అంతా కూడా మేము కోర్టులో డామినేట్ చేయగలిగాం. చాలా సంవత్సరాల కృషి ఫలితం ఇది. నా శ్రమ, మా కుటుంబం చేసిన త్యాగం, జనం, మీడియా ఇలా నాతో ఉన్న ప్రతి ఒక్కరి తోడ్పాటు ఫలితమిది’ అని సానియా చెప్పింది. తాను, హింగిస్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఆడడమే తమ విజయానికి ప్రధాన కారణమని ఆమె చెప్పింది. వచ్చే ఏడాది పోటీ మరింత ఎక్కువ ఉండవచ్చని అంటూ, అవసరమైనప్పుడు తాము తమ ఆట తీరును మార్చుకోవలసి ఉంటుందని చెప్పారు. అయితే పోటీ ఎంత తీవ్రంగా ఉంటే అంత మంచిదని, ఎందుకంటే అది తమకు దక్కిన గౌరవంగా తాము భావిస్తామని సానియా చెప్పింది.
రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే అదే తన జీవితంలో అత్యుత్తమవుతుందని సానియా చెప్తూ, పతకం సాధించడంపై ఎలాంటి గ్యారంటీ లేదని కూడా చెప్పింది. తనలో ఇంకా బోలెడంత టెన్నిస్ ఉందని చెప్పిన ఆమె తాను ఎప్పటిదాకా ఆడతానో చెప్పలేనని అన్నది. ఏ ఏడాదికాయేడు తాను నిర్ణయాలు తీసుకుంటానని అంటూ, వచ్చే ఏడాది తప్పక ఆడతానని తెలిపింది.